పెళ్లి తేదీని టాటూగా వేయించుకున్న నాగ‌చైత‌న్య (Naga Chaitanya).. టాటూ తీసేయాల‌నుకోవ‌డం లేదన్న చై

Updated on Aug 10, 2022 06:31 PM IST
త‌న చేతిపై ఉన్న టాటూ గురించి నాగ‌చైత‌న్య (Naga Chaitanya) తెలిపారు. త‌న పెళ్లి తేదీని చేతిపై టాటూగా వేయించుకున్నాన‌ని చై చెప్పారు.
త‌న చేతిపై ఉన్న టాటూ గురించి నాగ‌చైత‌న్య (Naga Chaitanya) తెలిపారు. త‌న పెళ్లి తేదీని చేతిపై టాటూగా వేయించుకున్నాన‌ని చై చెప్పారు.

టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య (Naga Chaitanya) విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతున్నారు. స‌మంత‌తో విడాకుల త‌ర్వాత ఆమె గురించి ఎలాంటి విష‌యాల‌ను నాగ‌చైత‌న్య బ‌య‌ట‌పెట్ట‌లేదు. స‌మంత గురించి నాగ‌చైత‌న్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన మాట‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. త‌న టాటూ గురించిన విష‌యాలను నాగ‌చైత‌న్య ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు. 

చై మ‌న‌సులో మాట‌

నాగ‌చైత‌న్య (Naga Chaitanya) 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, క‌రీనా క‌పూర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 'లాల్ సింగ్ చ‌డ్డా' ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా నాగ‌చైత‌న్య ఓ హిందీ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. త‌న కెరియ‌ర్‌తో పాటు స‌మంత గురించి, పెళ్లి గురించి చై చెప్పారు. 

టాటూ గురించి చెప్పిన చై

త‌న చేతిపై ఉన్న టాటూ గురించి నాగ‌చైత‌న్య (Naga Chaitanya) తెలిపారు. త‌న పెళ్లి తేదీని చేతిపై టాటూగా వేయించుకున్నాన‌ని చెప్పారు. త‌న టాటూను అభిమానులు కాపీ కొట్ట‌కండ‌న్నారు. త‌న పెళ్లి తేదీని మోర్స్ కోడ్‌లో టాటూగా వేయించుకున్నాన‌ని తెలిపారు. అభిమానులు త‌న టాటూను కాపీ కొట్ట‌వ‌ద్దంటూ చై కోరారు. ముఖ్య‌మైన విష‌యాల‌ను టాటూలుగా వేయంచుకోకూడ‌ద‌ని.. అవి మారే అవ‌కాశం ఉంటుంద‌ని నాగ‌చైత‌న్య త‌న మ‌న‌సులోని మాట చెప్పారు. టాటూ మార్చాల‌ని తాను ఎప్పుడూ అనుకోలేద‌న్నారు.

Read More: సమంతతో కలిసి నేను మళ్లీ సినిమా చేస్తే, ఎలా ఉంటుందో తెలుసా ? : నాగచైతన్య (Naga Chaitanya) మనసులోని మాట ఇదే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!