Lal Singh Chaddha: 'లాల్ సింగ్ చడ్డా'లో బాలరాజుగా తాత లుక్‌లో కనిపించిన నాగచైతన్య (Naga Chaitanya)
Lal Singh Chaddha: 'థ్యాంక్యూ' సినిమా తర్వాత హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటించిన 'లాల్ సింగ్ చడ్డా' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమిర్ ఖాన్, కరీనాకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్, నాగచైతన్య ఆర్మీ అధికారులుగా నటించారు. 'లాల్ సింగ్ చడ్డా'లో నాగచైతన్య బాలరాజు పాత్రలో నటించారు. ఆ పాత్రకు సంబంధించిన విశేషాలతో ఓ వీడియో రూపంలో మేకర్స్ రిలీజ్ చేశారు.
'లాల్ సింగ్ చడ్డా' నుంచి చై స్పెషల్ వీడియో
'లాల్ సింగ్ చడ్డా'లో నాగచైతన్య తన తాత అక్కినేని నాగేశ్వరరావు లుక్‌లో కనిపించనున్నారు. తాత లాగా కనిపించేందుకు నాగచైతన్య లుక్‌ను మార్చేశారు. 'బాలరాజు' సినిమాలో ఏఎన్ఆర్ (ANR) వెండితెరపై ఎలా కనిపించారో.. అలాంటి కాస్ట్యూమ్స్‌ను నాగచైతన్య ధరించారు. 'లాల్ సింగ్ చడ్డా'లో నాగచైతన్య ప్రయాణం ఎలా సాగిందో మేకర్స్ ఓ వీడియో ద్వారా ప్రేక్షకులకు అందించారు. అంతేకాదు తన అమ్మతో నాగచైతన్య సరదాగా జరిపిన సంభాషణలను కూడా వీడియోలో చూడవచ్చు.
బాలరాజు పాత్ర నచ్చింది - నాగచైతన్య
'నా పేరు బాలరాజు.. మాది బోడిపాలెం' అంటూ నాగచైతన్య (Naga Chaitanya) డైలాగులు ఆసక్తిగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను నాగచైతన్య ప్రేక్షకులతో పంచుకున్నారు. సాధారణంగా ఊరి పేర్లు ఇంటి పేర్లుగా ఉంటాయని.. అలాంటి ఐడియాతోనే 'బాలరాజు బోడి' పేరును క్రియేట్ చేశామన్నారు. అంతేకాకుండా తన ఫేస్ డిఫెరెంట్‌గా కనిపించేందుకు పళ్ళ దగ్గర ఎత్తైన క్లిప్ వాడానని చెప్పారు. సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశానన్నారు.
నాగచైతన్య 'లాల్ సింగ్ చడ్డా' కోసం ఎంతో కృషి చేశారని నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. నాగచైతన్య వాళ్ల నాన్న నాగార్జున, అమ్మ లక్ష్మీ తనకు ఫోన్ చేసి మాట్లాడటం సంతోషం అనిపించిందని అమిర్ అన్నారు. నాగచైతన్య పట్ల వారు చూపిస్తున్న ప్రేమ ఆశ్చర్యం కలిగించిందన్నారు.
నాగచైతన్య పేరెంట్స్ గ్రేట్ - ఆమిర్ ఖాన్
'లాల్ సింగ్ చడ్డా' చిత్ర యూనిట్ మొత్తం నాగచైతన్య (Naga Chaitanya) హార్డ్ వర్క్ గురించి ప్రేక్షకులకు తెలిపారు. నాగచైతన్య వాళ్ల అమ్మతో కలిసి ఉన్న విజువల్స్ ఆసక్తిగా అనిపించాయి. తన తాత అక్కినేని నాగేశ్వరరావు వేషం వేశానంటూ నాగచైతన్య వాళ్ల అమ్మకు చెప్పడం సరదాగా అనిపించింది. నాగచైతన్య ఈ సినిమా అనుభవాలను ఎంతో గొప్పగా వర్ణించారు. చై చెప్పినట్టుగానే చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియో విజువల్స్ ఎమోషనల్‌గా అనిపించాయి.
Read More: 'లాల్ సింగ్ చడ్డా'లో నాగచైతన్య (Naga Chaitanya) పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిరంజీవి (Chiranjeevi).