మెట్ల‌పై నుంచి ప‌డిపోయిన నిత్యా మీన‌న్ (Nithya Menen)... న‌డ‌వ‌లేని స్థితిలో కూడా ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌రు

Updated on Jun 29, 2022 04:01 PM IST
నిత్య‌మీన‌న్ Nithya Menen) కాలికి గాయం అవడంతో న‌డ‌వ‌లేకపోతున్నారు. న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో కూడా సినిమా ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌వుతున్నారు.
నిత్య‌మీన‌న్ Nithya Menen) కాలికి గాయం అవడంతో న‌డ‌వ‌లేకపోతున్నారు. న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో కూడా సినిమా ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌వుతున్నారు.

టాలీవుడ్‌లో నిత్యా మీన‌న్  (Nithya Menen)కు ఫాలోయింగ్ ఎక్కువే. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్ట‌ర్ రోల్స్‌లోనూ నిత్య‌మీన‌న్ న‌టించి మెప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం నిత్య‌మీన‌న్ కాలికి గాయం అవడంతో న‌డ‌వ‌లేకపోతున్నారు. న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో కూడా సినిమా ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌వుతున్నారు. నిత్యామీన‌న్ న‌టించిన వెబ్ సిరీస్ 'మోడ్ర‌న్ ల‌వ్ హైద‌రాబాద్' త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. నిత్యామీనన్ 'తెలుగు ఇండియన్ ఐడల్' జడ్జీగా కూడా వ్య‌వ‌హ‌రించారు.

నిత్యా మీన‌న్ పలు వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నటించిన 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' (Modern Love Hyderabad) వెబ్ సిరీస్ విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నిత్య‌మీన‌న్ కాలికి గాయం కావ‌డంతో ఓ క‌ర్ర స‌హాయంతో న‌డుస్తున్నారు. న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో కూడా ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌వుతున్నారు. 

 

నిత్య‌మీన‌న్ (Nithya Menen) కాలికి గాయం అవడంతో న‌డ‌వ‌లేకపోతున్నారు. న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో కూడా సినిమా ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌వుతున్నారు.

అభిమానుల‌కు షాక్

నిత్య‌మీన‌న్ (Nithya Menen) కాలుకు గాయ‌మైంది. మెట్ల‌పై నుంచి జారి ప‌డిపోవ‌డంతో నిత్య‌ామీన‌న్ గాయ‌ప‌డ్డారు. నిత్యామీన‌న్ కాలు విరిగింది. ప్ర‌స్తుతం నిత్య‌మీన‌న్ గాయం నుంచి కోలుకుంటున్నారు. అయితే తాను న‌టించిన వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్ల కోసం నిత్య హైద‌రాబాద్ వ‌చ్చారు.

వెబ్ సీరీస్ లాంచ్ కోసం అతి క‌ష్టంపైన నిత్య‌మీన‌న్.. బాడీ గార్డ్స్ స‌హాయంతో స్టేజ్ పైకి వ‌చ్చారు. నిత్య‌మీన‌న్ న‌డ‌వ‌లేని ప‌రిస్థితిని చూసిన ఆమె అభిమానులు బాధ‌ప‌డుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిత్యామీన‌న్ త్వ‌ర‌గా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప‌వ‌న్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయ‌క్ సినిమాలో నిత్యామీన‌న్ ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టించారు. 

నిత్యామీనన్ (Nithya Menen) ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా ఈ హీరోయిన్ ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా క్రియేట్ చేశారు. మ‌రోవైపు మ్యూజిక్ వీడియోస్, టెలివిజన్ షోలతోనూ ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతున్నారు. నిత్య‌మీన‌న్ ప్ర‌స్తుతం మ‌ల‌యాళం, త‌మిళ్ సినిమాల్లో న‌టిస్తున్నారు. 

Readmore: Nithya Menen: హీరోయిన్ గా, జ‌డ్జిగా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ బ్యూటీ నిత్యా మేనన్ !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!