Manchu Vishnu: చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలతో తలపడనున్న మంచు విష్ణు 'జిన్నా'(Ginna)

Updated on Aug 06, 2022 02:29 PM IST
'గాడ్‌ ఫాదర్‌', ‘ది ఘోస్ట్’ (The Ghost) రెండు సినిమాల‌కు విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. కానీ 'జిన్నా' చిత్రానికి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి బ‌జ్ లేదు.
'గాడ్‌ ఫాదర్‌', ‘ది ఘోస్ట్’ (The Ghost) రెండు సినిమాల‌కు విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. కానీ 'జిన్నా' చిత్రానికి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి బ‌జ్ లేదు.

టాలీవుడ్ మెగాస్టార్​ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్ట‌ర్ మోహన్​ రాజా కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం 'గాడ్ ఫాద‌ర్' (God Father). పవర్​ఫుల్ పొలిటికల్​ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మళయాలంలో సూపర్​హిట్​ అయిన.. 'లూసిఫర్​' సినిమాకు రీమేక్​ గా ఈ చిత్రం రూపొందనుంది. 

'గాడ్‌ ఫాదర్‌' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. అయితే.. గాడ్‌ ఫాదర్‌ సినిమా బృందం ఈ తేదీని ప్రకటించిన తర్వాత.. మంచు విష్ణు తన 'జిన్నా' (Ginna Movie) సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం ఆక్టోబ‌ర్ 5న విడుద‌ల కానున్నట్లు విష్ణు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. అయితే అదే రోజున నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రం కూడా విడుద‌ల కాబోతోంది. 

'గాడ్‌ ఫాదర్‌', ‘ది ఘోస్ట్’ (The Ghost) రెండు సినిమాల‌కు విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. కానీ 'జిన్నా' చిత్రానికి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి బ‌జ్ లేదు. ఈ చిత్రంలో విష్ణు గాలి నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. స‌న్నిలియోన్, రాజ్‌పుత్ పాయ‌ల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ..

'జిన్నా' చిత్రానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత, నిర్మాత కోన‌వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు.. క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అవ ఎంట‌ర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వ‌ర ప‌రుస్తుండ‌గా, ఛోటా కే. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నాడు. 

మంచు విష్ణు (Manchu Vishnu) సినిమాల విషయానికి వస్తే.. ‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనా రెడి’ వంటి సినిమాలు విష్ణుకు క‌మ‌ర్షియ‌ల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయ‌న సినిమాలకు భారీగా క‌లెక్ష‌న్లు రాక‌పోయినా, బడ్జెట్‌కు ఢోకా ఉండేది కాదు. 

క్ర‌మంగా మంచు విష్ణు సినిమాలు అన్నీ ఓకే విధంగా ఉండ‌టం.. కొత్త‌గా ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డంతో ప్రేక్షకులకు బోర్ కొట్టడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు.. చిరంజీవి, నాగార్జున (Nagarjuna) వంటి ఇద్దరు సీనియ‌ర్‌ హీరోల పోటీని త‌ట్టుకుని  ద‌స‌రా విన్న‌ర్‌గా నిలుస్తాడా? లేదా? అనేది చూడాలి. 

Read More: పవర్ ఫుల్ పాత్రలో మంచు విష్ణు (Manchu Vishnu).. జిన్నా ఫస్ట్ లుక్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!