కిన్నెర‌సాని (Kinnerasani) ట్రైల‌ర్ - ద్వేషానికైనా .. ప్రేమ‌కైనా ఓ లిమిట్ ఉండాలంటున్న‌ క‌ళ్యాణ్ దేవ్

Updated on Jun 05, 2022 07:28 PM IST
ఓటీటీ సంస్థ జీ-5లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా  క‌ళ్యాణ్ దేవ్‌ (Kalyaan Dhev) మూవీ  కిన్నెర‌సాని (Kinnerasani)  జూన్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీ సంస్థ జీ-5లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా క‌ళ్యాణ్ దేవ్‌ (Kalyaan Dhev) మూవీ కిన్నెర‌సాని (Kinnerasani) జూన్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌ (Kalyaan Dhev)కు న‌ట‌న అంటే ఎంతో ఇష్టం. విజేత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు క‌ళ్యాణ్ దేవ్. విజేత సినిమా అనుకున్నంత హిట్ సాధించ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత సూప‌ర్ మ‌చ్చి సినిమాతో కూడా ఫ్లాప్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం కిన్నెరసాని (Kinnerasani) సినిమాతో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. కిన్నెర‌సాని సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా థిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. కిన్నెరసాని ట్రైల‌ర్ రిలీజ్ అయింది. 'ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీ దానికి ఓ లిమిట్ ఉండాలి.. అది ద్వేషానికైనా .. చివ‌రికి ప్రేమ‌కైనా' అని చెప్పిన‌ క‌ళ్యాణ్ దేవ్ డైలాగులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తున్నాయి. 

ఓటీటీ సంస్థ జీ-5లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా కిన్నెర‌సాని (Kinnerasani)  జూన్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద‌ర్శ‌కుడు ర‌మ‌ణతేజ ద‌ర్శ‌క‌త్వంలో కిన్నెర‌సాని మూవీని తీశారు. క‌ళ్యాణ్‌దేవ్‌కు జోడీగా ఇద్ద‌రు హీరోయిన్లు అన్‌శీత‌ల్, కాశీష్‌ఖాన్  న‌టించారు. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌రసాగ‌ర్ సంగీతం అందించారు.ఎస్ఆర్‌టి ఎంట‌ర్టైన‌మెంట్స్‌, శుభ‌మ్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై రామ్ తాళ్ళూరి కిన్నెర‌సాని చిత్రాన్ని నిర్మించారు. 

Read More: https://telugu.pinkvilla.com/entertainment/mega-star-chiranjeevis-waltair-veerayya-movie-unit-going-to-malaysia-for-shooting-821

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!