మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ సినిమా ప్రమోషన్స్‌కి నయనతార (Nayanthara) హాజరవుతారా?

Updated on Sep 10, 2022 10:04 PM IST
ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా గాడ్‌ఫాదర్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది
ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా గాడ్‌ఫాదర్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన లేటెస్ట్‌ సినిమా గాడ్‌ఫాదర్. ఈ సినిమాలో చిరుకి చెల్లెలిగా లేడీ సూపర్‌‌స్టార్ నయనతార (Nayanthara) కనిపించనున్నారు. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన మలయాళ సినిమా ‘లూసిఫర్‌‌’కు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కింది. గాడ్‌ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.    

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌‌గా గుర్తింపు పొందారు నయనతార. తెలుగుతోపాటు తమిళంలోని దాదాపు అందరు స్టార్‌‌ హీరోలతో స్క్రీన్ షేర్‌‌ చేసుకున్నారు నయన్. గ్లామర్ పాత్రల కన్నా నటనకు ప్రాధాన్యం ఉన్న వైవిధ్యమైన సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారారు నయనతార.

ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా గాడ్‌ఫాదర్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

ప్రమోషన్స్‌కు దూరంగా..

ఇక, నయనతార నటించిన ఏ సినిమా ప్రమోషన్లలోనూ ఆమె కనిపించరు. ఒక సినిమాకి అగ్రిమెంట్ చేసుకునే సమయంలోనే ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం లేదని తేల్చి చెప్పేస్తారట. అయినా నయనతారకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు అంగీకరించి తమ సినిమాల్లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

డైరెక్టర్‌‌ విఘ్నేష్‌ శివన్‌ను ఇటీవలే  వివాహం చేసుకున్నారు నయనతార (Nayanthara).  ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటు తెలుగులో చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్‌‌కు చెల్లెలిగా నటిస్తున్నారు. ఇక హిందీలో కూడా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఒక సినిమాలో నటించారు నయన్. కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌కి నయనతార హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట.

అనుబంధం కారణంగా..

గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాకు నయనతారకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘తని ఒరువన్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అడిగితే నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా ప్రమోషన్స్‌కు హాజరయ్యే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.

విఘ్నేష్‌తో పెళ్లి తర్వాత నయనతార తెలుగు ప్రేక్షకులని కలుసుకునే అవకాశం రాలేదు. అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగు అభిమానులతో ముచ్చటించే చాన్స్‌ ఉంటుందని సమాచారం. అందుకే చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌కు నయనతార (Nayanthara) వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.

Read More : ‘గాడ్‌ఫాదర్’ సినిమా రిలీజ్‌పై సూచనలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఖైదీ గెటప్‌ కలిసొచ్చేనా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!