బార్సిలోనాలో నయనతార (Nayanthara) – విఘ్నేశ్‌.. పిక్స్‌ షేర్‌‌ చేసిన జంట..ఫోటోలు వైరల్!

Updated on Aug 16, 2022 02:23 PM IST
నయనతార (Nayanthara) – విఘ్నేశ్‌ ప్రస్తుతం బార్సీలోనాలో ఉన్నారు. అక్కడ తీసుకున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నయనతార (Nayanthara) – విఘ్నేశ్‌ ప్రస్తుతం బార్సీలోనాలో ఉన్నారు. అక్కడ తీసుకున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నయనతార (Nayanthara) ప్రేమ, పెళ్లిపై చాలా రూమర్లు వచ్చాయి. ఆమె బాయ్‌ఫ్రెండ్స్, లవర్స్ మీద ట్రోల్స్, మీమ్స్ లెక్కలేనన్ని వచ్చాయి. శింబు, ప్రభుదేవాలతో పెళ్లి చివరి వరకు వచ్చి ఆగిపోయింది. అయితే చివరి నిమిషంలో ఎందుకో అవి విఫలమయ్యాయి. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లో పీకల్లోతు ప్రేమలో పడ్డారు నయనతార. దాదాపు ఐదారు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

నయన్ – విఘ్నేశ్ జంటపై కూడా చాలా రూమర్లు వచ్చాయి. వీరిద్దరూ విడిపోయారని, పెళ్లి చేసుకునే ఆలోచన విరమించుకున్నారని, జాతకంలో దోషం ఉందని, పరిహారం చేయించుకునేందుకు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని చాలా మంది చాలా రకాలుగా చెప్పుకున్నారు కూడా. వీరిద్దరూ ఎక్కడైనా విడివిడిగా కనిపిస్తే చాలు ఈ రూమర్లు మరింతగా వినిపించేవి.

నయనతార (Nayanthara) – విఘ్నేశ్‌ ప్రస్తుతం బార్సీలోనాలో ఉన్నారు. అక్కడ తీసుకున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మహాబలిపురం టెంపుల్‌లో..

మహాబలిపురంలోని గుడిలో నయన్ – విఘ్నేశ్ జూన్ 9వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత నయన్ – విఘ్నేశ్ ఇద్దరూ మాల్దీవుల్లో సందడి చేశారు. హనీమూన్ ఫోటోలను విఘ్నేశ్ షేర్ చేశారు. అవి నెట్టింట్లో ట్రెండింగ్‌ అయ్యాయి కూడా. నయన్ ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కనిపించినా ఆమె మెడలో విఘ్నేశ్ కట్టిన పసుపు తాడు మాత్రం తప్పకుండా కనిపిస్తోంది. దీంతో ఆమె మీద అందరికీ గౌరవం మరింతగా పెరుగుతోంది.

నయనతార (Nayanthara) – విఘ్నేశ్‌ ప్రస్తుతం బార్సీలోనాలో ఉన్నారు. అక్కడ తీసుకున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఏరియల్ వ్యూలో..
నయన్ – విఘ్నేశ్‌ ప్రస్తుతం బార్సిలోనాలో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నయన్ ఫోటోలను విఘ్నేశ్ శివన్ ఏరియల్‌ వ్యూలో క్లిక్‌మనిపించారు. ఈ ఫోటోలో నయనతార (Nayanthara) మెడలో పసుపుతాడు స్పష్టంగా కనిపిస్తోంది.

Read More : 75వ సినిమా కోసం 3 నెలల డేట్స్ కేటాయించిన నయనతార (Nayanthara).. ఎంత రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!