రెజీనా కసాండ్రా (Regina Cassandra) మగాళ్లు, మ్యాగీ కామెంట్ పై అడివి శేష్ (Adivi Sesh) సెటైర్లు.. వీడియో వైరల్!

Updated on Sep 14, 2022 08:01 PM IST
వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas).
వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas).

బ్యూటిఫుల్ హీరోయిన్స్ రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా సినిమా 'శాకిని ఢాకిని' (Saakini Daakini). సుధీర్ వర్మ దర్శకతంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు చిత్రయూనిట్. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. 

మరోవైపు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు రెజీనా, నివేదా థామస్ (Nivetha Thomas). ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రెజీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మగాళ్లు, మ్యాగీ రెండూ కేవలం రెండు నిమిషాల్లో అయిపోతాయి అంటూ బాంబ్ పేల్చింది. అనంతరం ఇది కేవలం జోక్ అని చెప్పి మాట దాటేసింది. అయితే దీనిపై స్టార్ హీరో అడివి శేష్ స్పందించాడు.

'శాకిని ఢాకిని' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Saakini Daakini Pre Release Event) లో "ఏంటి ఓ ఇంటర్వ్యూలో మగాళ్లు, మ్యాగీ రెండు నిమిషాలు అని మాట్లాడుతున్నావు అని స్టేజీపైనే అడిగేశాడు. మరి నాకు స్టామినా ఎక్కువ అందుకే నేను ఎక్కువ కాలం సినిమాలు తీస్తూ ఉంటాను" అని చెప్పాడు. దానికి రెజినా నీ గురించి కూడా నేను రెండు నిమిషాలు మాట్లాడతాను అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం వీరి మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇంతకుముందు అడివి శేష్ (Adivi Sesh)-రెజీనా కాంబోలో 'ఎవరు' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అడివి శేష్, రెజీనాలు అద్భుతంగా నటించారు. అదే క్లోజ్‌నెస్‌తో ఇప్పుడు రెజీనా తన 'శాకిని ఢాకిని' సినిమా కోసం అడివి శేష్‌ను ముఖ్య అతిథిగా పిలిచింది. కాగా, కొరియన్ సూపర్ హిట్ 'మిడ్ నైట్ రన్నర్స్' చిత్రానికి రీమేక్‏గా ఈ 'శాకిని ఢాకిని' చిత్రాన్ని తీసుకువస్తున్నారు. 

Read More: "మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉంటాయా" అంటూ రెజీనా (Regina Cassandra) ఫైర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!