మేజ‌ర్ (Major) గురించి ప్ర‌తీ విద్యార్థి తెలుసుకోవాలి.. వీరికి స‌గం ధ‌ర‌కే టికెట్ : అడ‌వి శేష్ (Adivi Sesh)

Updated on Jun 15, 2022 01:06 PM IST
మేజర్ సినిమా హీరో అడివి శేష్ మాట్లాడుతూ, స్కూలు విద్యార్థుల‌కు స‌గం ధ‌ర‌కే టికెట్ కొనుగోలు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు.
మేజర్ సినిమా హీరో అడివి శేష్ మాట్లాడుతూ, స్కూలు విద్యార్థుల‌కు స‌గం ధ‌ర‌కే టికెట్ కొనుగోలు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు.

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా న‌టించిన 'మేజ‌ర్' (Major)  ప్రస్తుతం కొత్త రికార్డులను తిరగ రాస్తోంది. ముంబై ఉగ్ర దాడుల్లో ప్రాణ త్యాగం చేసిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్కా సబ్జెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా 'మేజర్' టీమ్‌‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా 'మేజ‌ర్' సినిమాను భార‌తదేశంలోని ప్ర‌తీ విద్యార్థి చూడాల‌ని అడివి శేష్ అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో, స్కూలు పిల్ల‌ల‌కు ఓ స్పెష‌ల్ ఆఫ‌ర్ కూడా ప్ర‌క‌టించారు. 

మేజ‌ర్ ఓ గొప్ప దేశ‌భ‌క్తి చిత్రం
అడివి శేష్ అమెరికాలో పుట్టారు. అక్క‌డే పెరిగారు. ప్ర‌ముఖ తెలుగు ర‌చ‌యిత అడివి బాపిరాజు మ‌నవడే అడివి శేష్. ఆయనపై తన తాత గారి ప్రేరణ ఉంది. విదేశాలలో ఉన్నప్పుడే, సినిమాల‌పై ఇష్టం పెంచుకున్న అడివి శేష్ హీరో అయ్యేందుకు ఇండియా వ‌చ్చారు. శేష్‌కు దేశ‌భ‌క్తి ఎక్క‌వ‌. అందుకే త‌న సినిమా కథలను కూడా అదే ఇతివృత్తంతో ఎంచుకొనేవారు. మేజ‌ర్ (Major) సినిమాతో శేష్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే గొప్ప దేశ‌భ‌క్తి చిత్రాన్ని తీశారు. 

విద్యార్థుల‌కు స‌గం ధ‌ర‌కే టికెట్ - అడివి శేష్
స్కూలు పిల్ల‌లు మేజ‌ర్ (Major) సినిమాను ఎంతో ఇష్ట‌ప‌డుతున్నార‌ని అడివి శేష్ చెప్పారు. ఎంతో మంది చిన్నారులు ఆర్మీలో జాయిన్ అవుతామంటూ, త‌న‌కు మెసేజ్‌లు పంపుతున్నార‌ని తెలిపారు.

ప్ర‌తీ విద్యార్థి మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ చేసిన త్యాగం గురించి తెలుసుకోవాల‌న్నారు. ఈ క్రమంలో విద్యార్థులు సగం ధరకే టికెట్‌ను కొనుగోలు చేసే సౌలభ్యాన్ని కలిగిస్తున్నామని శేష్ తెలిపారు. 

స్టూడెంట్స్ కోసం ప్ర‌త్యేక షోలు కూడా వేస్తామ‌ని అడివి శేష్ అన్నారు. స్టూడెంట్ టికెట్ల కోసం majorscreening@gmail.comకి మెయిల్ చేయాల‌ని కోరారు. 'మేజ‌ర్' గురించి రేప‌టి త‌రానికి తెలియజేయాలన్నదే త‌మ ల‌క్ష్యం అని అడివి శేష్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలిపారు. 
 

Read More: Major Movie: 'మేజర్' సినిమాపై చిరంజీవి ప్రశంసలు.. యూనిట్ కు స్పెషల్ డిన్నర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!