Nasser : సినిమాలకు పూర్తిగా దూరంగా కాబోతున్న నాజర్‌!.. అసలు కారణం ఏంటంటే?

Updated on Jun 29, 2022 05:37 PM IST
నాజర్
నాజర్

టాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్స్‌లో నటుడు నాజర్‌ (Nasser)‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్‌ హీరోలందరి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి అభిమానులను అలరిస్తున్నారు. పెద్ద సినిమా రిలీజ్ అయ్యిందంటే అందులో నాజర్‌‌ తప్పకుండా నటించే ఉంటారని చెప్పక తప్పదు. అంతటి గుర్తింపు పొందారు ఆయన.

తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే నాజర్‌‌.. ఇటీవల తక్కువ సంఖ్యలో సినిమాల్లోనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ షాకింగ్‌ న్యూస్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. త్వరలోనే నాజర్ నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

నాజర్

అనారోగ్యమే కారణమా?

అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నాజర్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఏమిటని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే దానికి కారణం ఏమై ఉంటుందని కూడా ఆలోచనలు చేస్తున్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల నటనకు దూరంగా ఉండాలని నాజర్ స్వయంగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నాజర్‌‌ అనారోగ్యంతో బాధపడ్డారు.

గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడ్డారు నాజర్. ఇక అప్పటి నుంచి చాలా సెలెక్టెడ్‌గానే సినిమాలు చేస్తున్నారు. అయితే, ఇక సినిమాలకు పూర్తిగా బ్రేక్‌ ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది. నటనకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని అనుకుంటున్నారని సమాచారం. యాక్టింగ్‌ కెరీర్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్. అయితే ఈ విషయంపై నాజర్‌‌ లేదా ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ నుంచి కానీ ఎటువంటి సమాచారం అందలేదు.

నాజర్, డైరెక్టర్ రాజమౌళి

బిజ్జలదేవ క్యారెక్టర్‌‌కు మంచి మార్కులు..

‘కళ్యాణ అగత్తిగళ్’ చిత్రంతో నాజర్‌ నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగా తనను తాను నిరూపించుకుంటూ గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నారు. సౌత్‌తోపాటు హిందీలో కూడా పలు సినిమాల్లో నటించారు నాజర్. జీన్స్‌ సినిమాలో డబుల్ రోల్, అతడు సినిమాలో మహేష్‌బాబుకు తాతగా, మాతృదేవోభం సినిమాలో నటించి మంచి నటుడు అనిపించుకున్న నాజర్‌ (Nasser)‌కు.. ప్రభాస్‌ బాహుబలి సినిమాలో పోషించిన బిజ్జలదేవ క్యారెక్టర్‌‌ మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది.

Read More : మహేష్‌బాబు(Mahesh Babu) డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న సుకుమార్, సందీప్ రెడ్డి వంగా? ఎవరికి చాన్స్ ఇస్తాడో..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!