పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పక్కన నటించడానికి ఎదురుచూస్తున్నా: నర్గిస్ ఫక్రి

Updated on Jun 30, 2022 10:49 PM IST
పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ నర్గిస్‌ ఫక్రి
పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ నర్గిస్‌ ఫక్రి

‘రాక్‌స్టార్‌'తో వెండితెరకు పరిచయమై తన రాకింగ్‌ స్టైల్‌తో ఆకట్టుకున్న అమెరికా అందం నర్గీస్‌ ఫక్రీ. నాలుగు పదుల వయసులోనూ వన్నెతగ్గని మెరుపుతో నేటితరం హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. ‘హరిహర వీరమల్లు’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీలోనే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో జతకట్టనున్న నర్గీస్‌ మీడియాతో పంచుకున్న ముచ్చట్లు..

అభిమానులే అండ..

ఈరోజు ఇంతమంది సెలబ్రిటీలుగా జీవిస్తున్నారంటే దానికి కారణం వారిని ఆదరించే అభిమానులు ఉండడమే. తమ పనులు వదులుకుని మరీ డబ్బులు ఖర్చుపెట్టి సినిమాలు చూసే అభిమానులుండడం నిజంగా మా అదృష్టం. ప్రత్యేక అభిమానం చూపే కొందరు అభిమానులతో నేనెప్పుడూ టచ్‌లో ఉంటా. ఎక్కడికెళ్లినా అందరూ అభిమానం చూపుతుంటే చాలా బాగుంటుంది.

రాక్‌స్టార్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌‌తో నర్గిస్ ఫక్రి

ఖాళీ సమయంలో..

రోజూ రెండు గంటలపాటు రకరకాల వ్యాయామాలు చేస్తూ జిమ్‌లోనే ఉంటా. నచ్చిన వంటలని తినడమే కాదు వండడం కూడా ఇష్టమే. ఏ పని చేసినా ఇష్టపడి దానిని ఆస్వాదిస్తూ చేస్తా. సినిమాలు, సిరీస్‌లు, షోలు కూడా చూస్తుంటా. పుస్తకాలు కూడా చదువుతా.

అమ్మకూడా నాలానే..

నేను చిన్నప్పటి నుంచీ టామ్‌ గర్ల్‌నే. అమ్మ కూడా అలానే ఉండేది. దాంతో నాకూ అలాగే ఉండడం అలవాటైంది. అమ్మెప్పుడూ అందంగా కనపడాలనిగానీ, అందంగా అలంకరించుకోవాలని కానీ ఆలోచించేది కాదు. సహజమైన అందానికే ఆకర్షణ ఎక్కువని నమ్మేది.

నర్గిస్ ఫక్రి

అందం వెనుక రహస్యం..

రాత్రి పడుకునేముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా టోనర్‌ అప్లె చేస్తాను. పొద్దున్నే కాకుండా రాత్రి కూడా బ్రష్‌ చేస్తాను. కళ్లకు, ముఖానికి రాత్రి పగలు సాధారణంగా వాడే క్రీములు రాసుకుంటాను.  ఏ వయసు వారైనా రోజూ తప్పనిసరిగా వ్యాయామం, యోగా చేయాలి. వీటిని దినచర్యలో భాగంగా చేసుకుంటే ఏ వయసులోనైనా ఆరోగ్యంగా అందంగా ఉంటారు.

నర్గిస్ ఫక్రి, పవన్‌ కల్యాణ్‌

టాలీవుడ్‌ ఎంట్రీ..

త్వరలోనే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నా. తెలుగు సినిమాలో నటించబోతున్నందుకు నిజంగా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ‘రోషనార’ పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. కానీ వినడానికే చాలా కొత్తగా, అందంగా ఉంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పక్కన క్రిష్‌ దర్శకత్వంలో నటించే రోజుకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని అంటున్నారు నర్గిస్.

Read More : Pawan Kalyan : విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్.. పిక్స్ వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!