Ram Pothineni: ప్రేమ, పెళ్లి వార్తలపై రామ్‌ పోతినేని షాకింగ్ కామెంట్స్.. ట్వీట్‌ వైరల్

Updated on Jun 29, 2022 09:09 PM IST
రామ్‌ పోతినేని
రామ్‌ పోతినేని

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) త్వర‌లో ‘ది వారియ‌ర్ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూలై 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. లింగుసామి దర్శకత్వం వహించిన ‘ది వారియర్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో రామ్‌ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. డైరెక్ట్ చేస్తున్న ది వారియ‌ర్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరు రామ్‌ పోతినేని. త్వరలోనే ఆయన లవ్‌ మ్యారేజ్‌ చేసుకోనున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఆ వార్తలు మరింతగా వైరల్ అవుతుండడంతో వాటిపై క్లారిటీ ఇచ్చారు రామ్. ట్విట్టర్‌‌ వేదికగా ఈ రూమర్స్‌కు చెక్‌ పెట్టారు ఈ ఎనర్జిటిక్ స్టార్.

రామ్ చేసిన ట్వీట్

రూమర్లకు చెక్‌..

‘ఓ దేవుడా.. ఆపండి.. ఇది పీక్ స్టేజ్‌కు చేరుకుంది. పెళ్లిపై నా ఫ్యామిలీ, స్నేహితుల‌ను ఒప్పించాల్సి ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే నేను చాలా త‌క్కువ‌గా హైస్కూల్‌కు వెళ్లేవాడిని. నేను ‘ఏ సీక్రెట్ హైస్కూల్ స్వీట్‌హార్ట్‌’ను పెళ్లి చేసుకోవ‌డం లేదు..’ అంటూ ట్వీట్ చేశారు.  రామ్‌ చేసిన ఈ ట్వీట్‌తో అతని పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడినట్టే.

ది వారియర్ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలాగే కన్నడ హీరోయిన్ అక్షర గౌడ కీలకపాత్ర పోషించింది. పవన్‌ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్న ది వారియర్ సినిమా ట్రైలర్‌‌ ఇటీవలే విడుదలైంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్‌ పోతినేని (Ram Pothineni) ఈ సినిమాలో పవర్‌‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌‌గా నటించారు.

Read More : రామ్‌ పోతినేని (Ram Pothineni)– -బోయపాటి కాంబినేషన్‌ సినిమాలో తమిళ హీరో.. మల్టీస్టారర్‌గా తెరకెక్కనుందా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!