మరో ఐటం సాంగ్‌లో టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha).. ఈసారి బాలీవుడ్‌లో చాన్స్!

Updated on Jun 29, 2022 07:42 PM IST
సమంతా రుత్ ప్రభు
సమంతా రుత్ ప్రభు

టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. చాలా కాలంగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న సామ్.. ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేయబోతోంది. ఈ మేరకు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సినిమాలు చేయనుందన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి కూడా.

కమర్షియల్‌ సినిమా అంటే తప్పకుండ ఒక ఐటం సాంగ్‌ ఉంటుంది. ఈమధ్య కాలంలో స్పెషల్‌ సాంగ్స్‌కు మంచి డిమాండ్‌ వచ్చింది. దీంతో తమ సినిమాల్లో ఒక స్పెషల్‌ సాంగ్‌ ఉండేలా హీరోలు, దర్శక -నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ స్పెషల్‌ సాంగ్‌లో స్టార్‌ హీరోయిన్స్‌తో స్టెప్పులు వేయించి సినిమాకు మరింత హైప్‌ తేవాలని అనుకుంటున్నారు.

ఈ క్రమంలో కాజల్‌, తమన్నా, సమంత వంటి స్టార్‌ హీరోయిన్స్‌ స్పెషల్‌ సాంగ్స్‌లో నర్తించి మరింత క్రేజ్‌ సంపాదించుకున్నారు కూడా. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది.

సమంతా రుత్ ప్రభు

సమంత డ్యాన్స్‌కు ఫిదా..

ఈ సినిమాలో సమంత ఒక ఐటం సాంగ్‌ చేసింది. ‘ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామా’ అంటూ నర్తించిన సామ్.. కుర్రకారు గుండెలను గుల్ల చేసింది. అంతేనా.. ఈ పాటకు తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ రికార్డులు సృష్టించింది. సెలబ్రిటీలు సైతం ఆ పాటలో సమంత డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. పలు ఈవెంట్లు, పెళ్లిళ్లు, షోలలో ఈ పాట ఇప్పటికీ మారుమోగుతోంది. 

ఇదిలా ఉంటే సమంత మరోసారి స్పెషల్‌ సాంగ్‌తో అలరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ ‘పుష్ప’సినిమాలో ‘ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామా’ సాంగ్‌తో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది సామ్‌. ఈ క్రమంలో ఆమెకు మరో స్పెషల్‌ సాంగ్‌ ఆఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఆ ఆఫర్‌‌ టాలీవుడ్‌ నుంచి కాకుండా బాలీవుడ్‌ నుంచి వచ్చిందని టాక్.

అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ వంగా సందీప్‌ తెరకెక్కిస్తున్న ‘యానిమల్‌’ సినిమాలో స్పెషల్ సాంగ్‌ కోసం సామ్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. రణ్‌బీర్‌‌ కపూర్, రష్మికా మందాన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయ్యింది. అయితే ఈ ఆఫర్‌‌కు సమంత (Samantha) గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు ఆగాల్సిందే. 

Read More:  'ఊ అంటావా మావా' పాటకు సల్మాన్ ఖాన్ (Salman Khan) కామెంట్స్.. సమంత (Samantha) రియాక్షన్ ఇదే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!