హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan).. మురిసిపోతున్న ఫ్యాన్స్!

Updated on Jun 30, 2022 10:16 PM IST
హైదరాబాద్‌ రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో బిగి బీ అమితాబ్‌ బచ్చన్
హైదరాబాద్‌ రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో బిగి బీ అమితాబ్‌ బచ్చన్

పాన్​ ఇండియా సినిమాలతో బాలీవుడ్​, టాలీవుడ్​కి మధ్యలో ఉన్న విభేదాలు తగ్గిపోతున్నాయి. భాషలతో సంబంధం లేకుండా అందరు హీరోలూ అన్ని భాషల్లోని సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన ‘మనం’ సినిమాలో ఒక సన్నివేశంలో కనిపించి తెలుగుప్రేక్షకులను పలకరించిన బిగ్​బీ ఇప్పుడు పూర్తి నిడివిగల పాత్రతో తెలుగు తెరపై మెరవనున్నారు. ఆ చిత్రం షూట్‌లో భాగంగా బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లోనే  ఉంటూ షూటింగ్​లో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ఆయన రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు. మెట్రో ట్రెయిన్​లో తీసే సన్నివేశాల చిత్రీకరణ కోసం స్టేషన్‌కు వెళ్లిన ఆయన్ను చూసేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. సాధారణంగా రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో మెట్రో స్టేషన్‌ మొత్తం ఖాళీగా, కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్రబృందంతోనే కనిపించిందని రాసుకొచ్చారు.

టాలీవుడ్‌ స్టార్లతో అమితాబ్

అమితాబ్‌ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా షూటింగ్​లో పాల్గొంటున్నారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఆఫీస్‌ ఓపెనింగ్‌లో..

 ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన ‘వైజయంతి మూవీస్‌’ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమితాబ్​ కూడా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, అమితాబ్‌ బచ్చన్‌, ప్రశాంత్‌నీల్‌, ప్రభాస్‌, నాని, దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొట్టగా.. తాజాగా ఓ వీడియోని కూడా వైజయంతి మూవీస్‌ షేర్‌ చేసింది.

అమితాబ్‌ బచ్చన్, ప్రభాస్

అమితాబ్‌, ప్రభాస్‌.. రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయాన్ని ప్రారంభించడం.. ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఆనాటి ఫొటోలను అమితాబ్‌ (Amitabh Bachchan) ఆసక్తిగా తిలకించడం.. యువ నటులు, దర్శకులతో బిగ్‌బి సరదాగా ముచ్చటించడం.. ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ వీడియో రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Read More : Prabhas: ప్రభాస్, అమితాబ్‌, నాని.. అభిమాన తారలంతా ఒకే ఫ్రేమ్‌లో.. సంబరపడిపోతున్న ఫ్యాన్స్‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!