Rashi Khanna : కామెడీ చేయడం చాలా కష్టం.. ఆ సీన్లలో నటించడం ఈజీ అంటున్న రాశీ ఖన్నా
నాగార్జున ఫ్యామిలీ అంతా కలిసి నటించిన ‘మనం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ‘రాశీ ఖన్నా’ (Raashi Khanna). ఆ సినిమాలో నాగ చైతన్యకు లవర్‌గా గెస్ట్ రోల్ చేసిన రాశీ ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, శ్రీనివాస కల్యాణం, వెంకీ మామ, ప్రతిరోజూ పండుగే, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ప్రస్తుతం గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చిత్రంలో, నాగచైతన్య సరసన థ్యాంక్యూ సినిమాలోనూ నటించింది. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తికాగా.. విడుదలకు రెడీగా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా జూలై 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా (Raashi Khanna) మీడియాతో మాట్లాడుతూ పలు కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రొమాన్స్ బోర్ కొట్టింది..
నాకు కామెడీ చేయడం చాలా కష్టం. కానీ రొమాన్స్ అలా కాదు. కామెడీ చేయడంతో పోలిస్తే, హీరోలతో రొమాంటిక్ సీన్స్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పటి వరకూ నాకు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్‌లో నటించి నటించి బోర్ కొట్టింది. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నాను. 'పక్కా కమర్షియల్' సినిమాలో కామెడీ చేశాను. ఆ క్యారెక్టర్‌లో ఎంజాయ్ చేస్తూ నటించాను అని చెప్పింది రాశీ ఖన్నా.
కాగా, పక్కా కమర్షియల్ సినిమాలో రాశీ ఖన్నా (Rashi Khanna) మొదటిసారి లాయర్ క్యారెక్టర్‌లో నటించింది. లేడీ లాయర్‌గా రాశీ సూపర్ కామెడీ చేసినట్టు ట్రైలర్‌లో తెలుస్తోంది.