‘పంచతంత్ర కథలు’ చెబుతానంటోన్న బిగ్‌బాస్‌ భామ‌ నందినీ రాయ్‌ (Nandini Rai)

Updated on Jul 13, 2022 03:34 PM IST
నందినీ రాయ్‌(Nandini Rai)
నందినీ రాయ్‌(Nandini Rai)

టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో న‌టించినా బిగ్‌బాస్‌తో బాగా పాపుల‌ర్ అయిన భామ నందినీ రాయ్‌(Nandini Rai). ప్రస్తుతం వ‌రుస‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీబిజీగా మారింది నందినీ రాయ్‌. ఇటీవల ‘గాలివాన ’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి ఓ ఆంథాలజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గంగనమోని శేఖర్‌ తెరకెక్కించిన ‘పంచతంత్ర కథలు’లో నందినీ రాయ్‌ నటిస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

నందినీ రాయ్‌ అసలు పేరు నీలం గౌహ్రానీ. సింధి కుటుంబానికి చెందిన ఈ అమ్మడు.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసి.. మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. సుమారు 80కిపైగా జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్‌కు మోడల్‌గా పనిచేసింది. అందాల పోటీల్లోనూ పాల్గొని 2008లో మిస్‌ హైదరాబాద్‌, 2010లో మిస్‌ ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు టైటిల్స్‌ గెలుచుకుంది.

పంచతంత్ర కథలు సినిమా పోస్టర్

తెలుగులోనూ..

ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో 2011లో హిందీ చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్‌’తో తెరంగేట్రం చేసింది. తెలుగులో మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెల్లోస్‌ తదితర సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ మెరిసింది. అయినా, నందినికి పెద్దగా గుర్తింపు రాలేదు.

2018లో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో పాల్గొనడంతో ఆమెకు పాపులారిటీ పెరిగింది. సినీ అవకాశాలూ క్యూ కట్టాయి. ఓ వైపు సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటోంది. హై ప్రీస్టెస్‌, షూటౌట్‌ ఎట్‌ ఆలేర్‌, మెట్రో కథలు, ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌, గాలివాన వెబ్‌సిరీస్‌లో నటించింది.

తెరపైనే కాదు.. సోషల్‌మీడియాలోనూ నందినీ రాయ్‌ (Nandini Rai) సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. తన అందచందాలతో కుర్రకారు మతిపోగొడుతుంది. మోడ్రన్‌ దుస్తుల్లో, చీరకట్టులో అందరినీ ఆకట్టుకుంటోంది.

Read More : సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ (Mani Sharma) బర్త్‌డే స్పెషల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!