Prabhu Deva : ప్రభుదేవా హీరోగా నటించిన 'మై డియర్ భూతం' సినిమా రిలీజ్‌ డేట్‌ ఖరారు

Updated on Jul 06, 2022 10:12 PM IST
ప్రభుదేవా (Prabhu Deva) మై డియర్ భూతం సినిమా పోస్టర్
ప్రభుదేవా (Prabhu Deva) మై డియర్ భూతం సినిమా పోస్టర్

కొరియోగ్రాఫర్‌‌గా టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రేక్షకులకు ప్రభుదేవా (Prabhu Deva) అందరికీ తెలిసినవారే. హీరోగా, డైరెక్టర్‌‌గా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. కొన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరమైన ప్రభుదేవా.. ‘మై డియర్ భూతం’ అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డిఫరెంట్ కథతో అవుట్ అండ్ అవుట్‌ కిడ్స్‌ ఫాంటసీగా ‘మై డియర్ భూతం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్.పి.పిళ్లై ప్రతిష్టాత్మకంగా ‘మై డియర్ భూతం’ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్ సినిమాలు తెరకెక్కించి విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్.రాఘవన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. జూలై 15వ తేదీన  ‘మై డియర్ భూతం’ సినిమాను విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

ప్రభుదేవా (Prabhu Deva) మై డియర్ భూతం సినిమా పోస్టర్

ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్‌ చేసేలా..

ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేయదగిన సినిమా ‘మై డియర్ భూతం’ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో రమ్యా నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. తమిళ్ బిగ్ బాస్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక, ప్రభుదేవా (Prabhudeva) ప్రధాన పాత్రలో నటించిన ‘మై డియర్ భూతం’ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ నెట్‌వర్క్‌ టీమ్‌ భారీ ధరకు కొనుగోలు చేసిందని టాక్.

Read More : Celebrity Love Marriages: సినీ 'ప్రేమ' బంధం .. డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న కథానాయికలు వీరే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!