Sarkaru Vaari Paata: అభిమానులును క‌లిసి రేండేళ్లు - మ‌హేష్ బాబు

Updated on May 08, 2022 11:28 AM IST
Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట సినిమా చేస్తుంటే పోకిరి చేసిన డేస్ గుర్తుకొచ్చాయ‌ని మ‌హేష్ బాబు అన్నారు. అభిమానుల‌ను చూసి రెండేళ్లు అయింద‌న్నారు.
Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట సినిమా చేస్తుంటే పోకిరి చేసిన డేస్ గుర్తుకొచ్చాయ‌ని మ‌హేష్ బాబు అన్నారు. అభిమానుల‌ను చూసి రెండేళ్లు అయింద‌న్నారు.

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట సినిమా చేస్తుంటే పోకిరి చేసిన డేస్ గుర్తుకొచ్చాయ‌ని మ‌హేష్ బాబు అన్నారు. అభిమానుల‌ను చూసి రెండేళ్లు అయింద‌న్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ‌హేష్ బాబు మాట‌లు అభిమానుల్లో జోష్ పెంచింది. ప‌రుశురామ్ త‌న‌కు ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ అని చెప్పారు. 

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ (Sarkaru Vaari Paata) త‌న నాన్న‌గారి అభిమానులు, త‌న అభిమానులకు ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ అయ్యార‌ని మ‌హేష్ బాబు అన్నారు. స‌ర్కారు వారి పాట చిత్రాన్ని త‌న‌కు ఇచ్చినందుకు మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్ అని మ‌హేష్ ప‌రుశురామ్‌తో అన్నారు. 

Sarkaru Vaari Paata

అభిమానుల‌ను క‌లుసుకుని రెండేళ్లు అవుతుంద‌ని మ‌హేష్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈవెంట్‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్ చెప్పారు. డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాటలో త‌న క్యారెక్ట‌ర్ కొత్త‌గా డిజైన్ చేశార‌న్నారు. త‌న లుక్‌, డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్‌, బాడీ లాంగ్వేజ్ ఇలా టోటల్‌గా ప‌ర‌శురామ్ త‌న‌ను కొత్త‌గా చూపించార‌న్నారు మ‌హేష్.స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  చేస్తున్న‌ప్పుడు పోకిరి సినిమా రోజులు గుర్తుకొచ్చాయని మ‌హేష్ బాబు అన్నారు.

క‌థ విని ఓకే చేసిన‌ప్పుడు .. ప‌ర‌శురామ్ ఇంటికెళ్లి మ‌హేష్‌కు ఓ మెసెజ్ పెట్టారు. "థాంక్యూ సార్‌.. ఒక్క‌డు సినిమా చూసి డైరెక్ట‌ర్ అవుదామ‌ని బండెక్కి హైద‌రాబాద్ వ‌చ్చాను. మీరు నాకు ఆప‌ర్చ్యునిటీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఈ సినిమాను ఎలా తీస్తానో..ఇరగదీసేస్తాను" అని మెసెజ్ చేశార‌ట‌. 

కీర్తిసురేష్ క్యారెక్ట‌రైజేష‌న్‌, పెర్ఫామెన్స్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంద‌న్నారు. కీర్తి ఎక్స్‌ట్రార్డిన‌రీగా చేసింద‌ని మ‌హేష్ పొగిడారు. ఏడాదిన్న‌ర స‌మ‌యంలో మేం ఎన్ని డేట్స్ అడిగినా ఓకే చేసింది. 

 

Sarkaru Vaari Paata

స‌ర్కారు వారి పాట‌కు (Sarkaru Vaari Paata) థ‌మ‌న్ ఇచ్చిన‌ మ్యూజిక్ చాలా బాగుంద‌ని మ‌హేష్ అన్నారు. క‌ళావ‌తి పాట ఎంత పెద్ద హిట్టో అంద‌రికీ తెలుస‌న్నారు. థ‌మ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి  పెద్ద ఫ్యాన్ అని మ‌హేష్ అన్నారు. రామ్ లక్ష్మ‌ణ్‌, శేఖ‌ర్ మాస్ట‌ర్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.  ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌కి, సినిమాటోగ్ర‌ఫీ మ‌దిగారికి థాంక్స్ చెప్పారు. స‌ర్కారు వారి పాట సినిమా కోసం వ‌ర్క్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్ చెప్పారు ప్రిన్స్ మహేష్ బాబు. మ‌రో మెమొర‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!