Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట మూడు రోజుల బిజినెస్ రూ.100 కోట్లు 

Updated on May 15, 2022 12:48 PM IST
Sarkaru Vaari Paata: మ‌హేష్ బాబు సినిమా స‌ర్కారు వారి పాట విడుద‌లైన మూడు రోజుల్లో స‌ర్కారు వారి పాట వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.
Sarkaru Vaari Paata: మ‌హేష్ బాబు సినిమా స‌ర్కారు వారి పాట విడుద‌లైన మూడు రోజుల్లో స‌ర్కారు వారి పాట వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

Sarkaru Vaari Paata: మ‌హేష్ బాబు సినిమా స‌ర్కారు వారి పాట బాక్సాఫీస్‌ను బ‌ద్దుల కొడుతుంది. విడుద‌లైన మూడు రోజుల్లో స‌ర్కారు వారి పాట వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. రిలీజ్ రోజు నుంచే కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. 

ఫ‌స్ట్ రోజు మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నా.. క‌లెక్ష‌న్ల‌లో టాప్‌గా నిలిచింది స‌ర్కారు వారి పాట‌. ఫ‌స్ట్ షో త‌ర్వాత సెకెండ్ షోకి హిట్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్ల‌ను ఈ సినిమా షేక్ చేస్తుంది. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ స‌ర్కారు వారి పాట 100 శాతం హిట్ అవుతుంద‌ని ముందు నుంచే చెబుతున్నారు. ప‌రుశురామ్ చెప్పిన‌ట్టే స‌ర్కారు వారి పాట హిట్‌గా నిలిచింది. అంతేకాదు మూడు రోజుల‌కే వంద కోట్ల రూపాయ‌ల మార్క్ దాటింది. 

మ‌హేష్ బాబు(Mahesh Babu), కీర్తి సురేష్ కెమిస్ట్రీ బాగుందంటూ ఆడియాన్స్ మంచి మార్కులు వేస్తున్నారు. ఇక మ‌హేష్ బాబు డైలాగులు థియేట‌ర్ల‌లో పేలాయంటూ అభిమానులు చెబుతున్నారు. ప్ర‌తీ ఏరియాలో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌ల‌తో ఈ సినిమా దూసుకుపోతుంది. 

నైజాంలో అనుకున్నంత క‌లెక్ష‌న్ లేకున్నా.. ఆంధ్రాలో వ‌సూళ్ల ప‌రంగా మంచి బిజినెస్ చేస్తుంది. మొత్తంగా ఇండియాలో స‌ర్కారు వారి పాట కాసుల సునామీ సృష్టిస్తుంది. ఇక అమెరికాలో మ‌హేష్ సినిమా క‌లెక్ష‌న్ల మోత మోగిస్తుంది.  1.8 మిలియన్ డాలర్లను వసూలు చేసి చ‌రిత్ర సృష్టిస్తుంది.  ఆంధ్రా, తెలంగాణలో మొత్తంగా 15 కోట్ల వసూళ్లను రాబ‌ట్టింది. 

అమెరికాలో మ‌హేష్ సినిమా స‌ర్కారు వారి పాట  1.8 మిలియన్ డాలర్లను వసూలు

స‌ర్కారు వారి పాట సినిమా మ‌రో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.  చాలా త‌క్కువ స‌మ‌యంలోనే రూ.100 కోట్ల‌ను కొల్ల గొట్టిన  మూవీగా స‌ర్కారు వారి పాట పేరు తెచ్చుకుంది. నైజాంలో కూడా మంచి క‌లెక్ష‌న్ ఉంటే రెండో రోజే రూ.100 కోట్లు వ‌చ్చేవ‌ని చిత్ర క్రిటిక్స్  అంటున్నారు. 

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట చిత్రం 2022 సంవత్సరంలో 100 కోట్ల గ్రాస్ సాధించిన నాలుగో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. RRR, రాధేశ్యామ్ మూవీ 1 రోజులు 100 కోట్లు సంపాదిస్తే.. సర్కారు వారీ పాటచ భీమ్లా నాయక్ చిత్రం మూడు రోజుల్లో కలెక్షన్లను రాబట్టింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!