లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను.. థ్యాంక్యూ టీజర్‌‌లో నాగచైతన్య (Naga Chaitanya)

Updated on May 25, 2022 06:29 PM IST
థ్యాంక్యూ టీజర్‌‌లో నాగచైతన్య (Naga Chaitanya)
థ్యాంక్యూ టీజర్‌‌లో నాగచైతన్య (Naga Chaitanya)

I am the only god damn reason for my success.

లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను

నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే..

టీజర్‌‌లో నాగచైతన్య చెప్పిన ఈ డైలాగ్స్‌ హైలైట్‌గా నిలుస్తున్నాయి.

వరుస సినిమాలు, సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). జోష్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చై.. తర్వాత మంచి మంచి సినిమాలతో తొందరగానే స్టార్ హీరో స్టేటస్‌ సంపాదించుకున్నాడు. నాగేశ్వరరావు మనవడిగానే కాకుండా విక్టరీ వెంకటేష్‌ మేనల్లుడిగా కూడా సుపరిచితుడైన చైతన్య.. మాస్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌, ఫ్యామిలీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

               బుధవారం రిలీజ్ అయిన థ్యాంక్యూ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంది. నాగచైతన్య డైలాగ్‌ డెలివరీకి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. బిజినెస్‌ మ్యాన్‌గా, ప్లేయర్‌‌గా, క్లాసీ, రఫ్‌, లవర్‌‌బాయ్ లుక్‌లో చైతన్య కనిపిస్తున్నాడు. ఏ మాయ చేశావె సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా నాగచైతన్య నుంచి ఆ రేంజ్ ఎక్స్‌ప్రెషన్స్‌ మనం ఎక్స్‌పెక్ట్‌ చెయ్యచ్చు అనే రేంజ్‌లో టీజర్‌‌ ఉంది.

థ్యాంక్యూ టీజర్‌‌లో నాగచైతన్య (Naga Chaitanya)

ఇటీవల లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో జోరు మీదున్న నాగచైతన్య.. ప్రస్తుతం విక్రమ్‌ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రష్యాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాలో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుకు డై హార్డ్‌ ఫ్యాన్‌గా, హాకీ ప్లేయర్‌‌గా కనిపించనున్నాడు చైతన్య.  హ్యూమర్‌‌, డ్రామా, రొమాంటిక్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొద్దిపాటి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు సమాచారం.

దిల్‌ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న నాగచైతన్య (Naga Chaitanya ) థ్యాంక్యూ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణ కుటుంబంలో పుట్టిన యువకుడు ప్రపంచ స్థాయిలో బిజినెస్‌ చేసే స్థాయికి ఎలా ఎదిగాడు.  దానికి సహకరించిన వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పడం కోసం ఏం చేశాడు అనేది సినిమా కథ. ఈ సినిమాలోని కీలక పాత్రల్లో అవికా గోర్, మాళవికా నాయర్, సుశాంత్‌ రెడ్డి, జబర్దస్త్ సుధీర్‌‌ కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

థ్యాంక్యూ టీజర్‌‌లో నాగచైతన్య (Naga Chaitanya)

 
 
లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను.. నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే..
థ్యాంక్యూ టీజర్‌‌లో అక్కినేని నాగచైతన్య
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!