సమంత (Samantha) బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్.. మొదటి సినిమాలో జతకట్టే హీరో ఎవరంటే?

Updated on Jul 08, 2022 01:56 PM IST
సమంత (Samantha).. సల్మాన్‌ఖాన్ సినిమాలో మెరవనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలపై క్లారిటీ లేదు.
సమంత (Samantha).. సల్మాన్‌ఖాన్ సినిమాలో మెరవనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలపై క్లారిటీ లేదు.

‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్ సమంత (Samantha). ఆ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన సమంత.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

తన మొదటి సినిమాలో హీరోగా చేసిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కూడా, సమంత పలు హిట్ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత, టాలీవుడ్‌ క్రేజీ కపుల్‌గా పేరుతెచ్చుకున్నారు చై – సమంత. అంతలోనే అభిమానులకు షాక్ ఇస్తూ, వారిద్దరూ ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇక, విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు సినిమా ఆఫర్లు తగ్గుతాయని అనుకున్నారు చాలామంది. వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ.. తెలుగుతోపాటు హిందీలో కూడా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ మరింత బిజీ హీరోయిన్‌గా మారారు సామ్.

ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు సమంత. ఇక ఇప్పుడు ఆమె ఏ హీరోతో జత కట్టి హిందీ సినిమా చేయబోతున్నారోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

యశోద, శాకుంతలం సినిమాల్లో సమంత

క్రేజీ హీరో సరసన..

ఈ క్రమంలో సమంత (Samantha).. సల్మాన్‌ఖాన్ సినిమాలో మెరవనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలపై క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు మరోసారి సమంత బాలీవుడ్ ఎంట్రీపై ఇండస్ట్రీలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వరుస హిట్‌ సినిమాలతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న 'ఆయుష్మాన్ ఖురానా'తో కలిసి సమంత స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లోకి ఎంట్రీ కోసం చాలా కథలు విన్న సామ్‌.. ఏ కథకూ ఓకే చెప్పలేదని సమాచారం.

అయితే తాజాగా విన్న కథలో హ్యూమర్, కామెడీ, సస్పెన్స్ అంశాలు సమంతకు నచ్చాయని.. అందుకే ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. ఇక, వరుణ్‌ ధావన్‌తో కలిసి సమంత నటిస్తున్న హిందీ వెబ్‌ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తెలుగులో ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాల్లో సమంత (Samantha) నటిస్తున్నారు.

Read More : హాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతున్న సమంత.. ఫ్యాన్స్‌కు సమాధానం చెప్పడం నా బాధ్యత

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!