విరాట్ కోహ్లి (Virat Kohli) బయోపిక్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)..?
భారీ అంచనాలతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లైగర్' (Liger) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. అయితే హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా ముందస్తు ప్లాన్ ప్రకారం ప్రమోషన్ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇందులో భాగంగానే దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా దర్శనమిచ్చాడు ఈ రౌడీ హీరో.
ఆదివారం దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఈ మ్యాచ్ ఎప్పటిలాగానే హై వోల్టేజ్ మ్యాచ్ గా మారిపోయింది. నువ్వానేనా అన్నట్లుగా ఎంతో ఉత్కంఠ భరితమైన పోరు జరిగింది. చివరి బంతి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి.
ఈ మ్యాచ్ చూడటానికి.. తన లైగర్ (Liger) సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లిన విజయ్ దేవరకొండ.. అక్కడ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విరాట్ కోహ్లి తనకెంతో ఇష్టమైన ఆటగాడని, తన బయోపిక్‌ను రూపొందిస్తే.. తాను కోహ్లిలాగా నటించటానికి సిద్ధమేనని తెలిపారు.
ఈ సందర్భంలో మరో ఆసక్తికరమైన విషయం చెప్పారాయన. '83' మూవీలో సీనియర్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) పాత్రలో నటించమని అడిగారని, అప్పుడు కుదరలేదని అన్నారు.
మరి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చెప్పిన విషయాన్ని భవిష్యత్తులో నిర్మాతలు పరిగణనలోకి తీసుకుంటారా.. కోహ్లి బయోపిక్ చేస్తే అందులో మన రౌడీస్టార్‌కి ఛాన్స్ ఇస్తారా! అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Read More: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ను తిలకిస్తూ, స్టేడియంలో సందడి చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)