ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ను తిలకిస్తూ, స్టేడియంలో సందడి చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

Updated on Aug 29, 2022 04:39 PM IST
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లో మంచి క్రికెట్ అభిమాని ఉన్నారు. ఆ మ్యాచ్‌ను ఆద్యంతం తిలకించారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లో మంచి క్రికెట్ అభిమాని ఉన్నారు. ఆ మ్యాచ్‌ను ఆద్యంతం తిలకించారు.

ఆసియా కప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నిన్న (ఆదివారం) తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో విక్టరీ సాధించింది. ఉత్కంఠ పోరులో విజయం భారత్‌ని వరించింది. 

అయితే ఈ విజయంతో హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హైలైట్ కావడం ఇక్కడ పాయింట్. ఇటీవలే 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాకి ఆశించిన టాక్ రాబట్టలేకపోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ ఊహించని విధంగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. 

అయితే, నెగెటివ్ రెస్పాన్స్‌ను ఏ మాత్రం పట్టించుకోని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఇంకా తన శక్తిమేరకు లైగర్ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన క్రికెట్ స్టేడియంలో మెరిశారు. 

స్టేడియంలో విజయ్ సందడి

అసలు విషయంలోకి వెళితే.. ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. ఉత్కంఠగా సాగిపోతున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించారు విజయ్ దేవరకొండ. 

మ్యాచ్‍ ప్రారంభానికి ముందు టీవీ స్క్రీన్ పై కనిపించి సందడి చేశారు. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్‌ అక్రమ్, భారత మాజీ పేస్ బౌలర్ ఇర్ఫాన్‌ పఠాన్‌లతో (Irfan Pathan) కాసేపు ముచ్చటించారు విజయ్. ఆ తర్వాత ఉత్కంఠ పోరు చూస్తూ ఇండియా తప్పకుండా గెలవాలని తన మద్దతు పలికారు విజయ్ దేవరకొండ.

Read More: 'లైగర్' (Liger) సినిమాకు బాయ్ కాట్ సెగ.. ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!