'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) - థియేటర్లలో కలెక్షన్ల దండయాత్ర చేస్తున్న చోళరాజులు
విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తీ, జయంరవి 'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించారట. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రతీ ఒక్కరు చాలా బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు ఓ రేంజ్‌లో రివ్యూలు ఇస్తున్నారు. దర్శకుడు మణిరత్నం మాయాజాలం 'పొన్నియిన్ సెల్వన్1'ను కొందరు రెండో సారి చూస్తున్నారట. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు తెలుపుతున్నారు.
'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమా తమిళనాడులో ఓ హిస్టరీ క్రియేట్ చేయనుందంటూ తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. కచ్చితంగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ హిట్‌గా నిలుస్తుందంటున్నారు. మణిరత్నం ఇలాంటి సినిమాను తెరకెక్కించడంపై తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు చిత్రీకరించడం గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమాలో మొదటి ఆఫ్ హీరో కార్తీ అద్భుతంగా ముందుకు నడిపించారంటూ సినిమా క్రిటిక్స్ అంటున్నారు. ఇక త్రిష నటన కూడా ఓ రేంజ్‌లో ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఈ సినిమాకే హైలెట్ అంటున్నారు.
త్రిష, ఐశ్వర్యరాయ్‌ల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయట. మణిరత్నం ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారంటూ నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
విక్రమ్‌తో సెల్ఫీలు
తమిళనాడులో 'పొన్నియిన్ సెల్వన్ 1' చిత్రాన్ని విక్రమ్ ప్రేక్షకులతో కలిసి చూశారు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న విక్రమ్‌ను చూసిన ప్రేక్షకులు ఆయన నటనను మెచ్చుకున్నారు. అంతేకాకుండా 'పొన్నియిన్ సెల్వన్ 1' చిత్రం ఎంతో నచ్చిందని విక్రమ్‌కు తెలిపారు. ప్రేక్షకుల ప్రశంసలతో విక్రమ్ ఆనందం వ్యక్తం చేశారు. విక్రమ్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్యాన్స్ పోటీ పడ్డారు.
'పొన్నియిన్ సెల్వన్ 1' ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇండియాతో పాటు అమెరికాలోనూ ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది. ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది.
'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, శోభిత ధూళిపాళ కీలక పాత్రలలో నటించారు. చోళ రాజుల చరిత్రకు సంబంధించిన నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతంగా నిర్మించారు.
ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా 'పొన్నియిన్ సెల్వన్1' (Ponniyin Selvan 1) ఉంటుందట. తెలుగులో చిరంజీవి, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి, కన్నడలో ఉపేంద్ర అలాగే హిందీలో అజయ్ దేవగన్ వాయిస్ అందించినట్టు తెలుస్తోంది. వివిధ భాషల్లో రిలీజ్ అయ్యే పొన్నియిన్ సెల్వన్ సినిమాను హీరోల వాయిస్‌తో ప్రేక్షకులకు మరింత చేరువ చేయనున్నారు మణిరత్నం.