'లాల్ సింగ్ చ‌డ్డా' ట్విట్ట‌ర్ రివ్యూ - నాగ‌చైత‌న్య (Naga Chaitanya) న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తున్న ప్రేక్ష‌కులు

Updated on Aug 11, 2022 12:24 PM IST
Laal Singh Chaddha:  'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాలో అమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఆర్మీ జవాన్లుగా న‌టించారు.
Laal Singh Chaddha: 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాలో అమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఆర్మీ జవాన్లుగా న‌టించారు.

Laal Singh Chaddha: హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెర‌కెక్కించిన‌ సినిమా 'లాల్ సింగ్ చ‌డ్డా' ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అమిర్ ఖాన్, క‌రీనా క‌పూర్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. టాలీవుడ్ నటుడు నాగ చైత‌న్య (Naga Chaitanya) 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య ఈ సినిమాలో ఆర్మీ జవాన్లుగా న‌టించారు.

ఈ సినిమా చూసిన నెటిజ‌న్లు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ’లాల్ సింగ్ చ‌డ్డా’ చిత్రంలో కొన్ని స‌న్నివేశాలు అద్భుతంగా ఉన్నాయ‌ని.. ఎమోష‌న‌ల్‌గా అనిపించాయ‌ని త‌మ అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్‌లో తెలిపారు. 

Laal Singh Chaddha:  'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాలో అమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఆర్మీ జవాన్లుగా న‌టించారు.

చిరు స‌మ‌ర్ఫ‌ణ‌లో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌ణ‌లో 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాను తెలుగులో విడుద‌ల చేశారు. ‘రుద్ర‌వీణ‌’, ‘త్రినేత్రుడు’ సినిమాల త‌ర్వాత చిరంజీవి వేరే చిత్రాన్ని.. అదీ నాగ‌చైత‌న్య‌, అమీర్‌ఖాన్‌ల సినిమాను స‌మ‌ర్పించ‌డం విశేషం.

'లాల్ సింగ్ చ‌డ్డా' హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆగ‌స్టు 11న‌ రిలీజ్ అయింది. వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ’లాల్ సింగ్ చ‌డ్డా’ సినిమాకు  అద్వైత్‌ చందన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 


 

Laal Singh Chaddha:  'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాలో అమిర్ ఖాన్, నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఆర్మీ జవాన్లుగా న‌టించారు.

చై యాక్టింగ్ న‌చ్చింది - ప్రేక్ష‌కులు

'లాల్ సింగ్ చ‌డ్డా'లో నాగ‌చైత‌న్య  (Naga Chaitanya) బోడిపాలెం బాల‌రాజు అనే పాత్ర‌లో న‌టించారు. నాగ‌చైత‌న్య  తాత అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గతంలో 'బాలరాజు' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాలో నాగ‌చైత‌న్య న‌ట‌న చాలా బాగుందంటూ నార్త్ ప్రేక్ష‌కులు కూడా ప్ర‌శంసిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ‌చైత‌న్య, సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

Read More: Aamir Khan & Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసం అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha) ప్రివ్యూ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!