Suriya: సూర్య కొత్త సినిమా పేరు 'అచలుడు' .. దర్శకుడు 'బాల' చేస్తున్న వినూత్న ప్రయోగం !

Updated on Jul 12, 2022 02:04 PM IST
సూర్య (Suriya) అగరం ఫౌండేషన్ పేరిట ఎందరో పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. అలాగే బడుగు, బలహీనవర్గాల వారికి చేయూతనిస్తున్నారు.
సూర్య (Suriya) అగరం ఫౌండేషన్ పేరిట ఎందరో పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. అలాగే బడుగు, బలహీనవర్గాల వారికి చేయూతనిస్తున్నారు.

సూర్య (Suriya) .. దక్షిణాదిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కథానాయకుడు. గతంలో దర్శకుడు బాల డైరెక్షన్‌లో ఈయన  'శివపుత్రుడు' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే దర్శకుడితో సూర్య తన 41 వ చిత్రాన్ని చేస్తున్నారు. సూర్య 41 (Suriya 41) అనే వర్కింగ్ టైటిల్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

కృతిశెట్టి (Kriti Shetty) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ప్రొడక్షన్స్ బ్యానరుపై సూర్య తన సతీమణి జ్యోతికతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టరును, టైటిల్‌ను నిర్మాతలు విడుదల చేశారు. దర్శకుడు బాల పుట్టినరోజును పురస్కరించుకొని వీటిని రిలీజ్ చేశారు. 

వెరైటీ టైటిల్

ఈ సినిమా తెలుగు టైటిల్ పేరు 'అచలుడు' (Achaludu). అలాగే తమిళ టైటిల్ పేరు 'వణంగన్' (Vanangaan). ఈ సినిమా పోస్టరులో హీరో సూర్య చిరిగిన బట్టల్లో ఒక డిఫరెంట్ యాక్షన్ లుక్‌లో దర్శనమివ్వడం గమనార్హం. ఈ సినిమాలో సూర్య ఓ జాలరి పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

సూర్య (Suriya) ఏ సినిమాలో నటించినా, వాటిపై తెలుగు ప్రేక్షకులకు సైతం చాలా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే, సూర్య నటించిన ప్రతీ చిత్రం తెలుగులో సైతం విడుదలై సూపర్ హిట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాలలో సూపర్ క్రేజ్
వీడొక్కడే, సింగం, సెవెన్త్ సెన్స్, గజిని, 24, ఆకాశమే హద్దురా లాంటి సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. సూర్య (Suriya) సినిమాలకు తెలుగులో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఆయన సినిమా రిలీజైతే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం బయ్యర్లలోనూ ఉంది.

అందుకే సూర్య సినిమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో చాలా క్రేజ్ ఏర్పడింది. మరి ఈయన కొత్త సినిమా 'అచలుడు' తెలుగులో ఏమేరకు సక్సెస్ అవుతుందో తెలుసుకోవాలంటే, చిత్రం విడుదల అయ్యేవరకూ వేచి చూడాల్సిందే. 

Read More: ఆస్కార్ ఆహ్వానం అందుకున్న రోలెక్స్ స‌ర్‌... సౌత్ ఇండియ‌న్ హీరో సూర్య (Suriya) కు అరుదైన గౌర‌వం !


 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!