క్రేజీ కాంబోలో మరో చిత్రం!.. ‘గజినీ’ సీక్వెల్‌ (Ghajini 2)కు సూర్య (Suriya) గ్రీన్ సిగ్నల్?

Updated on Oct 15, 2022 03:55 PM IST
‘గజిని’ సీక్వెల్‌ (Ghajini 2)కు సంబంధించి సూర్య (Suriya), మురుగదాస్ (AR Murugadoss) మధ్య చర్చలు నడుస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం
‘గజిని’ సీక్వెల్‌ (Ghajini 2)కు సంబంధించి సూర్య (Suriya), మురుగదాస్ (AR Murugadoss) మధ్య చర్చలు నడుస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం

ప్రముఖ కథానాయకుడు సూర్య (Suriya) క్రేజీ సీక్వెల్‌లో నటించనున్నారట. తమిళ టాప్ దర్శకుల్లో ఒకరైన ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) కాంబినేషన్‌లో సూర్య హీరోగా తెరకెక్కిన ‘గజిని’ చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నారట. 2008లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హిట్‌గా నిలిచి.. సూర్యకు తెలుగు నాట ఊహించని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ మూవీని హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కించి.. అక్కడా బంపర్ హిట్ కొట్టారు డైరెక్టర్ మురుగదాస్. 

‘గజిని’ తర్వాత సూర్య–మురుగదాస్ కాంబోలో రూపొందిన చిత్రం ‘సెవెన్త్ సెన్స్’. 2011లో రిలీజైన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత గత పదకొండేళ్లలో వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబోలో సినిమా రాబోతోందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ‘గజిని’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలని మురుగదాస్ అనుకుంటున్నారట. దీని కథను కూడా ఆయన సిద్ధం చేశారని సమాచారం. అలాగే ఇందులో నటించే విషయమై సూర్యతో మురుగదాస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వినికిడి. అయితే దీనికి సంబంధించి సూర్య, మురుగదాస్‌ల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. 

ఒకవేళ సూర్య, మురుగదాస్‌ల కాంబినేషన్ సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ మళ్లీ షేక్ అవ్వాల్సిందే. ‘గజిని’ (Ghajini 2) సీక్వెల్ తెరకెక్కితే తమిళంతో పాటు తెలుగులోనూ అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. మరి, ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ఇక, సూర్య ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నారు. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సూర్య.. కమల్ హాసన్‌ మూవీ ‘విక్రమ్’తో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు. ఆ చిత్రంలో రోలెక్స్ పాత్రలో కనిపించి థియేటర్లను షేక్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసే తదుపరి సినిమాలపై అంచనాలు మరింతగా ఉండనున్నాయి. అందుకే నెక్స్ట్ నటించబోయే చిత్రాల విషయంలో సూర్య జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 

Read more: ‘రోలెక్స్’ పాత్రలో నటించాలంటే భయమేసింది.. సూర్య (Suriya Sivakumar) కామెంట్స్ వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!