సినిమా ఆగిపోయింద‌నే ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టిన సూర్య (Suriya)

Updated on Jun 01, 2022 07:37 PM IST
త్వ‌ర‌లో సూర్య 41 సినిమా మ‌ళ్లీ షూటింగ్ జ‌రుపుకుంటుందంటూ సూర్య (Suriya)  ట్వీట్ చేశారు.
త్వ‌ర‌లో సూర్య 41 సినిమా మ‌ళ్లీ షూటింగ్ జ‌రుపుకుంటుందంటూ సూర్య (Suriya) ట్వీట్ చేశారు.

సూర్య (Suriya) సినిమాల‌కు సౌత్‌లో ఉన్న క్రేజే వేరు. ద‌ర్శ‌కుడు బాలాతో సూర్య ఓ సినిమా చేయాలి. సూర్య 41 వ సినిమా బాలాతోనే అంటూ ఫిక్స్ అయ్యారు. కానీ బాలా, సూర్య కాంబో సినిమా ఆగిపోయిందంటూ ఈ మ‌ధ్య ప్ర‌చారం జ‌రుగుతుంది. ఫేక్ వార్త‌ల‌కు సూర్య చెక్ పెట్టారు. త‌న 41వ సినిమా బాలా ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలిపారు. 

పుకార్ల‌కు చెక్ పెట్టిన సూర్య‌
సూర్య (Suriya) బాలాతో దిగిన ఓ ఫోటోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. షూటింగ్ లొకేష‌న్‌లో బాలాతో దిగిన ఫోటోను షేర్ చేశారు. త్వ‌ర‌లో సూర్య 41 సినిమా మ‌ళ్లీ షూటింగ్ జ‌రుపుకుంటుందంటూ ట్వీట్ చేశారు. బాలాతో చేసే సినిమా ఆగిపోలేదంటూ సూర్య క్లారిటీ ఇచ్చారు. ఉప్పెన ఫేం కృతిశెట్టి సూర్య‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రాజ‌శేఖ‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. డ‌బుల్ రోల్‌లో సూర్య ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీకి జీవీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 

హీరోతో పాటు గెస్ట్ రోల్స్‌లో న‌టిస్తున్న సూర్య‌
సూర్య ఎప్పుడూ కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారు. మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ సినిమాలో సూర్య ఓ పాత్ర‌లో న‌టించారు. సూర్య విక్ర‌మ్ సినిమాలో చేసిన పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని కిట్రిక్స్ అంటున్నారు. ఇక‌ మాధ‌వ‌న్ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేస్తున్నారు సూర్య శివ‌కుమార్. హీరోగా కాకుండానే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సూర్య (Suriya) స్పెష‌ల్ రోల్స్ చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!