3D టెక్నాలజీలో 10 భాషల్లో విడుదల కాబోతున్న 'సూర్య 42' (Suriya 42).. మోషన్ పోస్టర్ రిలీజ్!

Updated on Sep 09, 2022 06:08 PM IST
ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న 'సూర్య 42' (Suriya 42) చిత్ర‌బృందం తాజాగా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.
ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న 'సూర్య 42' (Suriya 42) చిత్ర‌బృందం తాజాగా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

త‌మిళంతో పాటు తెలుగులో కూడా స‌మానంగా క్రేజ్ ద‌క్కించుకున్న నటుడు సూర్య‌ (Hero Suriya). సూపర్ స్టార్ రజినీకాంత్‌, లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు 'గజిని' రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు.

హీరో సూర్య (Hero Suriya) ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలే తన 42వ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేఈ జ్ఞానవేల్ రాజా సగర్వ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న 'సూర్య 42' (Suriya 42) చిత్ర‌బృందం తాజాగా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న‌ట్లు మోష‌న్ పోస్ట‌ర్ చూస్తుంటే తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా 3డీలో ప‌ది భాష‌ల్లో రూపొందుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక, సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న‌ట్లు విజువ‌ల్స్ చూస్తే తెలుస్తోంది. 

తాజాగా విడుద‌లైన 'సూర్య 42' (Suriya Motion Poster) మోష‌న్‌పోస్ట‌ర్ వేరే లెవ‌ల్లో ఉంది. మోష‌న్ పోస్ట‌ర్‌లోని గ్రాండియ‌ర్ విజువ‌ల్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వ‌స్తున్నాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్‌, స్టూడీయో గ్రీన్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సూర్య‌కు జోడీగా దిశా ప‌టాని (Disha Patani) న‌టిస్తున్నట్లు సమాచారం.

Read More: Project K: ప్ర‌భాస్ (Prabhas) సినిమా 'ప్రాజెక్ట్ కె'లో మ‌హేష్ బాబు.. మ‌రో ఇద్ద‌రు హీరోలు కూడా ఓకే చెప్పార‌ట‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!