కోలీవుడ్ స్టార్ విశాల్ (Vishal)తో ప్రేమాయణం?.. రూమర్ మీద క్లారిటీ ఇచ్చిన నటి అభినయ (Abhinaya)

Updated on Oct 31, 2022 01:51 PM IST
స్టార్ హీరో విశాల్ (Vishal)తో తాను ప్రేమలో పడినట్లు వస్తున్న వార్తలపై నటి అభినయ (Abhinaya) స్పందించారు
స్టార్ హీరో విశాల్ (Vishal)తో తాను ప్రేమలో పడినట్లు వస్తున్న వార్తలపై నటి అభినయ (Abhinaya) స్పందించారు

దక్షిణాది నటుల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్నవారిలో విశాల్ (Vishal) ఒకరు. వరుసగా హిట్లు కొడుతూ తమిళంలో స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది. ‘పందెం కోడి’ చిత్రంతో తెలుగులో ఆయనకు మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత ‘భయ్యా’, ‘పొగరు’, ‘వాడు వీడు’, ‘రాయుడు’, ‘ఇంద్రుడు’ ‘అభిమన్యుడు’, ‘డిటెక్టివ్’ లాంటి సినిమాలు టాలీవుడ్‌లో విశాల్ క్రేజ్‌ను మరింతగా పెంచాయి. 

నటుడిగా,నిర్మాతగా కొంతకాలంగా విశాల్ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న విశాల్ పెళ్లిపై పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. విశాల్ ఇప్పటికే పలువురితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వినిపించాయి. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో ఆయన లవ్ ఎఫైర్ సాగించినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత తమ మధ్య ఏదీ లేదని వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. అనంతరం హైదరాబాద్‌కు చెందిన యువతితో విశాల్‌కు నిశ్చితార్థం అయ్యింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్కడితోనే దానికి ఎండ్ కార్డ్ పడింది.

విశాల్ (Vishal), అభినయ (Abhinaya) త్వరలో  పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వస్తున్నాయి

రూమర్లను ఖండించిన అభినయ

తాజాగా విశాల్ ప్రేమ, పెళ్లికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ నటి అభినయ (Abhinaya), విశాల్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఈ రూమర్ మీద అభినయ స్పందించారు. హీరో విశాల్‌ను తాను ప్రేమిస్తున్నానని, త్వరలో తమ వివాహం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. 

ఈ వార్తల్లో నిజం లేదు

‘విశాల్ నటిస్తున్న తాజా సినిమా ‘మార్క్ ఆంటోని’లో ఓ రోల్‌లో నటిస్తున్నా. షూటింగ్ కోసం తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన కొందరు నెటిజన్స్ మేమిద్దరం ప్రేమలో ఉన్నామని అనుకుంటున్నారు. త్వరలో మేం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని అభినయ స్పష్టం చేశారు. ఇకపోతే, ప్రస్తుతం ‘మార్క్ ఆంటోని’ చిత్రంతోపాటు ‘లాఠీ’ సినిమాలోనూ విశాల్ నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘డిటెక్టివ్’ మూవీకి సీక్వెల్‌ను రూపొందించే పనుల్లోనూ ఆయన బిజీబిజీగా ఉన్నారు. 

Read more: "నేను మోసం చేసింది ప్రేక్షకులను.. మళ్లీ సినిమా తీసి వారిని ఎంటర్టైన్ చేస్తా" : పూరి జగన్నాథ్ (Puri jagannath)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!