'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న కోలీవుడ్ అతిరథ మహారథులు..!

Published on Sep 25, 2022 02:47 PM IST

త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం (Maniratnam) అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1). రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో అతి త్వరలో పొన్నియన్ టీమ్ ప్రధాన నగరాల్లో సందర్శించనుంది. 

ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ర‌జ‌నీకాంత్ (Rajinikanth), క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా ట్రైల‌ర్‌ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 

అలాగే ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు. 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' (Ponniyin Selvan 1) సినిమా తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైద‌రాబాద్‌లో జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌రిగింది. 

పొన్నియిన్ సెల్వన్’ సినిమా 10వ శతాబ్దంలో చోళరాజుల కాలానికి సంబంధించిన కథతో రూపొందుతోంది. ఇక, ఈ చిత్రంలో భారీ తారాగణాన్ని చూడబోతున్నాం. చియాన్ విక్రమ్ (Vikram) ముఖ్య పాత్ర పోషించగా.. కార్తీ (Karthi), త్రిష (Trisha), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), ప్రకాష్ రాజ్ (Prakash Raj), జయం రవి, జయరాం, ప్రభు, శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read More: Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైల‌ర్ కోసం ఏక‌మైన కోలీవుడ్.. చోళ రాజుల పాల‌న‌పై మ‌ణిర‌త్నం సినిమా