Dhanush : ధనుష్ తెలుగులో చేస్తున్న డైరెక్ట్ సినిమా 'సార్' .. విలన్‌గా డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు ఛాన్స్ !

Updated on Jul 07, 2022 12:00 AM IST
సాయికుమార్, సార్ సినిమా పోస్టర్, ధనుష్ (Dhanush)
సాయికుమార్, సార్ సినిమా పోస్టర్, ధనుష్ (Dhanush)

'రఘువరన్‌ బీటెక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush). మారి, మారి–2 సినిమాలతో మాస్ ఆడియన్స్‌ను కూడా తన యాక్షన్‌తో అలరించారు.

తాజాగా ధనుష్ నటిస్తున్న సినిమా ‘సార్’. తొలిసారి తెలుగులో ఆయన డైరెక్ట్‌గా సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్‌‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘సార్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్న యువకుడు ఎడ్యుకేషన్ మాఫియాపై చేసిన పోరాట కథతో 'సార్' సినిమా రూపొందుతోంది. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణపై ఈ సినిమాలోని కథానాయకుడు తిరగబడతాడు.

రఘువరన్ బీటెక్‌ సినిమా పోస్టర్

లెక్చరర్‌‌గా ధనుష్‌..

ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కిన 'రఘువరన్ బీటె'క్ సినిమా కథ దాదాపుగా ఇదే కధాంశం అయినా.. 'సార్‌‌' సినిమాలో మాత్రం ఆయన లెక్చరర్‌‌గా నటిస్తున్నారు. ‘సార్‌‌’ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్‌గా డైలాగ్‌ కింగ్ సాయికుమార్ నటిస్తున్నారని టాక్. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సాయికుమార్ చెప్పారు.

సౌత్ ఇండస్ట్రీలో విలన్‌గా సాయికుమార్‌‌కు మంచి పేరే ఉంది. ఇప్పటికే చాలా సినిమాల్లో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాయికుమార్.. డైలాగ్స్‌తో కూడా జనాలను అలరిస్తుంటారు. పోలీస్ స్టోరీ, ప్రస్థానం లాంటి సినిమాలు సాయికుమార్‌కు మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ‘గాలివాన’ వెబ్ సిరీస్‌లో నెగెటివ్ రోల్‌ చేసి అదరగొట్టారు సాయికుమార్. ఇప్పుడు ధనుష్ ‘సార్’ సినిమాలో విలన్‌గా నటిస్తుండడం విశేషం. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, నర్రా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

వరుణ్‌ తేజ్‌ ‘తొలిప్రేమ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈయన తీసిన ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్‌దే’ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ క్రమంలో ‘సార్’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు వెంకీ. తెలుగులో మొదటిసారి డైరెక్ట్ సినిమా చేస్తున్న ధనుష్‌కు (Dhanush) ‘సార్’ మూవీ ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి మరి.  

Read More : ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమాలో ఆదిత్య కరికాలన్‌ పాత్రలో చియాన్ విక్రమ్ (Vikram).. పోస్టర్ విడుదల చేసిన మేకర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!