Dhanush: ధనుష్ నటిస్తున్న "ది గ్రే మ్యాన్" చిత్రానికి సంబంధించిన టాప్ 10 ఆసక్తికరమైన విషయాలు మీకోసం !
ది గ్రే మ్యాన్ (The Gray Man).. హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. సీఐఏ ఇన్వెస్టిగేషన్ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దక్షిణాది నటుడు ధనుష్ (Dhanush) ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆ పాత్రపై చాలా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను మనమూ తెలుసుకుందాం
మార్వెల్ కామిక్స్ అభిమానులకు ఎరుకే
మార్వెల్ కామిక్స్ అంటే ఇష్టపడే వారికి రూసో బ్రదర్స్ (Russo Brothers) ఎవరో తెలుసు. ఈ దర్శక ద్వయం తెరకెక్కించిన కెప్టెన్ అమెరికా, ఎవెంజర్స్ లాంటి సినిమాలు రికార్డుల మీద రికార్డులను నమోదు చేశాయి. ఇప్పుడు వీరు 2009 లో విడుదలైన మార్క్ గ్రీనీ నవల 'ది గ్రే మ్యాన్' ఆధారంగా అదే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కథా రచయిత గురించి క్లుప్తంగా..
'ది గ్రే మ్యాన్' నవల రాసిన మార్క్ గ్రీనీ జీవితం గురించి మాట్లాడుకుంటే.. ఆయన ఓ బార్టెండర్‌గా, వెయిటర్‌గా తన జర్నీ మొదలుపెట్టి, అనుకోకుండా నవలా రచయిత అయ్యారట. ఈయన తాను వ్రాసిన తొలి నవల 'ది గ్రే మ్యాన్' సక్సెస్‌తో వరుసగా నవలలు వ్రాశారు. అమెరికన్ లిటరేచర్‌కు ఎన్నో సూపర్ హిట్ నవలలు అందించారు.
ప్రత్యేక పాత్రలో ధనుష్
ధనుష్ (Dhanush) ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర పేరు అవిక్ సన్. లెథల్ ఫోర్స్ పేరుతో ఈ క్యారెక్టర్ పోస్టర్‌ను ఇటీవలే నిర్మాతలు విడుదల చేశారు.
మన వాళ్లకు హాలీవుడ్ కొత్తేమీ కాదు
బ్లడ్ స్టోన్ (రజనీకాంత్), డెత్ అండ్ టాక్సీస్ (సుమన్), స్లమ్ డాగ్ మిలియనీర్ (అనిల్ కపూర్), ది గ్రేట్ గాట్స్‌బీ (అమితాబ్ బచ్చన్) లాంటి హాలీవుడ్ సినిమాలలో మన భారతీయులు నటించి మెప్పించారు. ఇప్పుడు ధనుష్ కూడా వారి బాటలోనే పయనించడం విశేషం.
భారీ బడ్జెట్ సినిమా
రూ.200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో 'ది గ్రే మ్యాన్' తెరకెక్కుతోంది. ది నోట్ బుక్, గ్యాంగ్‌స్టర్ స్క్వాడ్, ఫస్ట్ మ్యాన్, ది బ్లేడ్ రన్నర్ 2049 లాంటి సినిమాలలో నటించిన ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling) ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.
తక్కువ థియేటర్లలో రిలీజ్
'ది గ్రే మ్యాన్' చిత్రం 15 జులై 2022 తేదిన ప్రపంచవ్యాప్తంగా చాలా కొద్ది థియేటర్లలో మాత్రమే రిలీజ్ కానుంది. అలాగే 22 జులై తేదిన నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా మరెందరో ప్రేక్షకులను అలరించనుంది.
తొలుత బ్రాడ్ పిట్ అనుకున్నారట..
ఈ సినిమాలో హీరోగా తొలుత బ్రాడ్ పిట్ (Brad Pitt) ని తీసుకోవాలని భావించారట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం గమనార్హం.
అంతర్జాతీయ హంతకుడి పాత్రలో..
ధనుష్ (Dhanush) ఈ సినిమాలో ఓ అంతర్జాతీయ హంతకుడి పాత్రను పోషిస్తున్నారట. ఇటీవలే విడుదలైన ఓ వీడియోలో ఆయన హీరో ర్యాన్ గోస్లింగ్‌తో చేస్తున్న ఫైట్ సీన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం విశేషం.
త్వరలోనే ఇండియా రానున్న రూసో బ్రదర్స్
ది గ్రే మ్యాన్ సినిమా దర్శకులు రూసో బ్రదర్స్ (Russo Brothers) త్వరలోనే ఇండియా రానున్నారట. వీరు ఇండియాలోనే ఓ ప్రముఖ థియేటర్‌లో ఈ సినిమాను ధనుష్‌తో కలిసి వీక్షించనున్నారని టాక్.
ఇది ఓ అరుదైన అవకాశం : ధనుష్ (Dhanush)
'ది గ్రే మ్యాన్' చిత్రంలో నటించే అరుదైన అవకాశం తనకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని, తానెప్పుడూ అవకాశాల కోసం పాకులాడలేదని, అయితే ఇది అనుకోకుండా వచ్చిన ఛాన్స్ అని.. ఒక నటుడిగా చాలా కొత్త విషయాలు నేర్చుకొనే అవకాశం 'ది గ్రే మ్యాన్' ద్వారా తనకు దక్కిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ధనుష్ ఈ సినిమాలో చాలా కొద్ది సేపే కనపడతారట. కానీ, ఆ పాత్ర ప్రభావం జనాల మీద కచ్చితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవండీ.. 'ది గ్రే మ్యాన్' సినిమా సంగతులు !
Read More: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ టాప్ 10 చిత్రాలు.. ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిందే !