PonniyinSelvan 1: ఆకట్టుకుంటున్న 'పొన్నియిన్ సెల్వన్–1' నుంచి సెకండ్ సింగిల్ (Cholachola) గ్లింప్స్ రిలీజ్..!

Updated on Aug 19, 2022 05:55 PM IST
'పొన్నియిన్ సెల్వన్–1' (PonniyinSelvan1) సినిమాలోని ‘చోళ చోళ’ (Cholachola) అంటూ సాగే ఈ పాట తమిళ వెర్షన్‌ను సత్యప్రకాష్, విఎం మహాలింగం పాడారు.
'పొన్నియిన్ సెల్వన్–1' (PonniyinSelvan1) సినిమాలోని ‘చోళ చోళ’ (Cholachola) అంటూ సాగే ఈ పాట తమిళ వెర్షన్‌ను సత్యప్రకాష్, విఎం మహాలింగం పాడారు.

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మణిరత్నం (Director Mani Ratnam) తెరకెక్కించిన తాజా చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీగా అంచ‌నాలున్నాయి. చియాన్ విక్ర‌మ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుద‌లైన ప్రచార చిత్రాలు, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసాయి. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుస అప్‌డేట్‌ల‌ను ఇస్తున్నారు.

'పొన్నియిన్ సెల్వన్–1' (Ponniyin Selvan 1) చిత్రం నుండి మొదటి సింగిల్ సాంగ్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. తాజాగా రెండవ సింగిల్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వరపరిచిన ఈ పాట తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 

'పొన్నియిన్ సెల్వన్–1' (Ponniyin Selvan 1) సినిమాలోని ‘చోళ చోళ’ (Cholachola) అంటూ సాగే ఈ పాట తమిళ వెర్షన్‌ను సత్యప్రకాష్, విఎం మహాలింగం పాడారు. లిరిక్స్ ఇళంగో కృష్ణన్ రాశారు. మొదటి సింగిల్ సాంగ్ 'పొన్ని నాదిని' అనే పాట కూడా ఇళంగో రాశాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ పాటను విక్రమ్ పై చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

1995 నాటి కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని మణిరత్నం (Director Mani Ratnam), ఎలాంగో కుమారవేల్, బి జయమోహన్‌లతో కలిసి తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Read More: Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వ‌న్' టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం థ్రిల్లింగ్ అనిపించింది - మ‌హేష్ (Mahesh Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!