Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత .. చెన్నై బిర్యానీ తినిపించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ..!

Updated on Jun 15, 2022 05:30 PM IST
జూ.ఎన్టీఆర్, అట్లీ (Junior NTR, Atlee)
జూ.ఎన్టీఆర్, అట్లీ (Junior NTR, Atlee)

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ‘ఆర్ఆర్ఆర్'తో దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్నారు. ఈ సినిమా విజయం తర్వాత.. ఆయన మరిన్ని బిగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రస్తుతం... కొరటాల శివతో కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరో కోసం తమిళ దర్శకుడు అట్లీ ప్రత్యేకంగా బిర్యానీని ప్యాక్ చేయించి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మామూలుగా ఎన్టీఆర్ భోజనప్రియుడు. దీంతో చెన్నై నుంచి వస్తున్న తమిళ దర్శకుడు అట్లీకి తలపాకట్టి బిర్యానీ తీసుకురమ్మని కోరాడాంట. ఎన్టీఆర్‌కు చెన్నై బిర్యానీ అంటే చాలా ఇష్టమంట. అందుకే అట్లీ చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌‌లో బిర్యానీని ఆర్డర్ చేయించుకొని మరీ వచ్చాడంట.  

ఆర్ఆర్ఆర్ ‌లో ఎన్టీఆర్ పాత్రకు ఫ్యాన్స్ ఫిదా

ఈ విషయాన్ని కోదండరామిరెడ్డి (Kodandarami Reddy) తనయుడు సునీల్ తెలిపాడు. డైరెక్టర్ అట్లీ ఎన్టీఆర్‌కు ఒక కథ చెప్పాలనుకోగా, ఆయన దగ్గరికి వెళ్తున్న సమయంలో ఎన్టీఆర్...  అట్లీకి ఫోన్ చేసి తలపాకట్టి బిర్యాని తీసుకురావాల్సిందిగా కోరాడట. దీంతో అట్లీ ఆ బిర్యానీని ఎన్టీఆర్ కోసం ఆర్డర్ చేశాడట. 'వచ్చి తిని వెళ్లొచ్చు కదా.' అని అట్లీతో తనకున్న పరిచయంతో సునీల్ తెలిపారట.

కానీ .'అది తన కోసం కాదు అని.. ఎన్టీఆర్ కోసమని.' అట్లీ చెప్పారట. దాంతో వెంటనే సునీల్ షాకయ్యాను అని తెలిపాడు. కాగా, ఒకప్పుడు మంచి ఆహారప్రియుడిగా కితాబునందుకున్నా కూడా, ఇప్పుడు సినిమాల కోసం తన డైట్‌ని తగ్గించాడు ఎన్టీఆర్.

ఇక.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో నటించేందుకు,ఎన్టీఆర్ గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అట్లీ ఎన్టీఆర్‌కు కథ చెప్పేందుకే వెళ్లాడంట. ఇంతకీ అది ఎలాంటి కథ అన్నది మున్ముందు అందరికీ తెలిసే అవకాశం ఉంది. కచ్చితంగా భారీ యాక్షన్ ఫిల్మ్‌నే అట్లీ ప్లాన్ చేశాడని కూడా బజ్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అందనున్నాయి. 

ఇక, ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’(Jawan) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయగా హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది 2023 జూన్ 2న ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అట్లీ డైరెక్ట్ చేసిన ‘రాజా  రాణి’, ‘అదిరింది’, ‘థేరి’ సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టాయి. 

ప్రశాంత్ నీల్‌ చిత్రంతో ఎన్టీఆర్ బిజీ

కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashant Neel) తో, ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అసురుడు అనే టైటిల్ కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించిన ఫోటోను కూడా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ 31 సినిమాకు ‘అసురుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తారక్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. విలన్ తరహా పాత్రలో తారక్ మరోసారి నటవిశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

Read More: Sonu Sood: తెలంగాణలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనపై స్పందించిన సోనూసూద్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!