'విక్ర‌మ్' (Vikram) 100 రోజుల పండుగ‌.. క‌మ‌ల్ హాస‌న్  (Kamal Haasan) సినిమా కొత్త రికార్డు

Updated on Sep 09, 2022 07:26 PM IST
Vikram: 'విక్ర‌మ్' మ‌రో రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమా విడుద‌లై వంద రోజులు పూర్త‌యింది.
Vikram: 'విక్ర‌మ్' మ‌రో రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమా విడుద‌లై వంద రోజులు పూర్త‌యింది.

Vikram: విశ్వనటుడు  కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. క‌మ‌ల్ న‌టించిన 'విక్ర‌మ్' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా త‌మిళ‌నాడులో ప‌లు రికార్డులు బ్రేక్ చేసింది. మూడేళ్ల త‌రువాత త‌మిళ సినీ రంగంలో భారీ విజ‌యం సాధించిన సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. అంతేకాకుండా 'విక్ర‌మ' రిలీజ్ అయి వంద రోజులు పూర్త‌యింది. 100 రోజులు పూర్త‌వ‌డంతో మేక‌ర్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. 

100 రోజుల సంబురం

'విక్ర‌మ్' సినిమాకు క‌మ‌ల్ హాస‌న్ అభిమాని లోకేష్ క‌న‌గ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో త‌మిళ స్టార్ న‌టుడు విజయ్ సేతుపతి. సూర్య‌తో పాటు మ‌ల‌యాళ న‌టుడు ఫహద్ ఫాసిల్ స్పెష‌ల్ రోల్స్‌లో న‌టించి మెప్పించారు.

'విక్ర‌మ్' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు అందుకుంది. 'విక్ర‌మ్' మ‌రో రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమా విడుద‌లై వంద రోజులు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ స్పెష‌ల్ పోస్ట‌ర్లు రిలీజ్ చేసింది. 

Vikram: 'విక్ర‌మ్' మ‌రో రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమా విడుద‌లై వంద రోజులు పూర్త‌యింది.

క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన విక్ర‌మ్
క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) న‌టించిన‌ 'విక్ర‌మ్' ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ద‌ద్ద‌రిల్లేలా చేసింది. త‌మిళ‌నాడులో 'బాహుబ‌లి 2' రికార్డును బ్రేక్ చేసి క‌లెక్ష‌న్ల‌లో రెండో స్థానానికి చేరింది. వ‌సూళ్ల ప‌రంగా త‌మిళ్ సినిమాల్లో మొద‌టి స్థానంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన '2.0' ఉండ‌గా.. రెండో స్థానంలో 'విక్ర‌మ్' నిలిచింది .ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరింది.

'విక్ర‌మ్' ఇప్ప‌టివ‌ర‌కు రూ. 450 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. తెలుగులో దాదాపు రూ.18 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్‌లు సాధించింది. విక్ర‌మ్ సినిమాకు తెలుగులో రూ.10 కోట్ల వ‌ర‌కు లాభం వ‌చ్చింది. తెలుగు వ‌ర్ష‌న్‌ను హీరో నితిన్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేశారు. 

'విక్ర‌మ్' సినిమాను జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా త‌మిళ్, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు.

Read More : Vikram 2 ( విక్రమ్ 2) : కమల్ హాసన్ (Kamal Haasan) ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ ! ఈ టాప్ 10 విశేషాలు మీకోసమే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!