Vikrant Rona 3D Trailer: ‘విక్రాంత్ రోణ’ 3D ట్రైలర్ సందర్భంగా హీరో సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Published on Jun 25, 2022 09:02 PM IST

కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona Movie). ఈ మూవీ 3డీ ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాదాద్ లో వేడుకుగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌, అఖిల్ అక్కినేని, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, మంగ్లీ, అనూప్ భండారి, షాలిని త‌దిత‌రులు పాల్గొన్నారు. 

కాగా, ఈ చిత్రాన్ని అనూప్ భండారి దర్శకత్వం వహించారు. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉత్త‌రాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజ‌న్స్ బ్యాన‌ర్‌పై అలంకార్ పాండియ‌న్ ఈ సినిమాకు స‌హ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ (Vikrant Rona Telugu Trailer) కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వ‌హించారు. 

ఇక, ఈ కార్యక్రమంలో హీరో సుదీప్ (Hero Sudeep) మాట్లాడుతూ.. "మా చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతోమంది కలిస్తేనే ఈ సినిమా సిద్దమైంది. నాలుగేళ్లుగా అనూప్ నేనూ కలిసి పనిచేస్తున్నాం. రోణ పాత్ర తీర్చిదిద్దడానికే మాకెంతో సమయం పట్టింది. సినిమా ప్రారంభించిన కొంతకాలానికే కరోనా రావడంతో షూటింగ్ నిలిచిపోయింది. అలాంటి సమయంలో మేమంతా హైదరాబాద్ కి వచ్చి సుమారు రెండు నెలలు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉన్నాం. నాగార్జున ధైర్యం చేసి మాకోసం స్టూడియో తలుపులు తీశారు. ఒక్క కరోనా కేసు కూడా లేకుండా సినిమా షూట్ పూర్తి చేశాం. మాతో పాటు షూట్ ప్రారంభించిన చాలామంది మూడు, నాలుగు రోజులు చేయగానే కరోనా కేసులు రావడంతో వాయిదా వేసుకున్నారు. రాజమౌళి (SS Rajamouli), విజయేంద్రప్రసాద్, ఇచ్చిన ఈగ వల్లే నన్ను ఇక్కడి ప్రేక్షకులందరూ గుర్తుపడుతున్నారు. అందుకు వాళ్లకు ధన్యవాదాలు" అని సుదీప్ అన్నారు. 

Read More: Vikrant Rona (విక్రాంత్ రోణ) : "రారా రాకమ్మ" అంటూ దుమ్ము రేపిన సుదీప్, జాక్వెలిన్