డైరెక్టర్ శంకర్ (Shankar) నాకు స్ఫూర్తి.. రాంచరణ్‌ (Ram Charan) ఆర్‌‌సీ15లో నటిస్తున్న ఎస్‌జే సూర్య ట్వీట్

Updated on Sep 12, 2022 08:11 PM IST
రాంచరణ్ (Ramcharan), డైరెక్టర్ శంకర్‌‌ దర్శకత్వంలో ఆర్‌‌సీ 15 వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది
రాంచరణ్ (Ramcharan), డైరెక్టర్ శంకర్‌‌ దర్శకత్వంలో ఆర్‌‌సీ 15 వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది

మెగాపవర్‌‌ స్టార్ రాంచ‌ర‌ణ్ (Ram Charan) ప్రస్తుతం శంక‌ర్‌ (Shankar) డైరెక్షన్‌లో నటిస్తున్నారు. ఆర్‌‌సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాక్టర్, డైరెక్టర్ ఎస్‌జే సూర్య ఆర్‌‌సీ15లో కీలకపాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్‌‌సీ15 సినిమాలో ఎస్‌జే సూర్య లుక్‌ను ఇటీవలే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ ఫస్ట్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఎస్‌జే సూర్య ట్విట‌ర్ ద్వారా ఇంట్రెస్టింగ్ కామెంట్‌ చేశారు. ఈ ట్వీట్‌తో సినీ లవర్స్‌లో జోష్ నింపుతున్నారు సూర్య.

రాంచరణ్ (Ramcharan), డైరెక్టర్ శంకర్‌‌ దర్శకత్వంలో ఆర్‌‌సీ 15 వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది

చాలా విషయాలు నేర్చుకుంటున్నా..

‘జూనియ‌ర్ ఆర్టిస్టుగా ఉన్నప్పటి నుంచి శంక‌ర్‌కు వీరాభిమానిని. న‌న్బన్‌లో గెస్ట్ రోల్ చేశా. ప్రస్తుతం ఆర్‌సీ 15లో విల‌న్‌గా న‌టిస్తున్నాను. క్రియేటివ్ డైరెక్టర్ శంక‌ర్ అభిమానిగా, ఒక న‌టుడిగా ఆయ‌న‌ను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. ఆయ‌న నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను’ అని ట్వీట్‌లో చెప్పుకొచ్చారు ఎస్‌జే సూర్య. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఆర్సీ15లో అంజ‌లి, క‌న్నడ న‌టుడు జ‌య‌రామ్, న‌వీన్ చంద్ర, సునీల్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా రాంచరణ్‌ (Ram Charan) హీరోగా నటిస్తున్న ఆర్‌‌సీ15 షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చిన శంకర్ (Shankar).. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు.

Read More : రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్న రాంచరణ్‌ (Ram Charan).. ఆర్‌‌సీ15 నుంచి లీకైన వీడియో వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!