క‌ర‌ణ్ షోలో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా స‌మంత‌(Samantha) !.. అక్ష‌య్‌తో క‌లిసి స్టెప్పులేసిన సామ్

Updated on Jul 20, 2022 02:17 PM IST
`కాఫీ విత్‌ కరణ్‌`టాక్‌ షోలో సమంత  (Samantha), అక్షయ్‌ కుమార్‌ మధ్య జరిగిన స‌న్నివేశాలు ఆస‌క్తిగా మారాయి. 
`కాఫీ విత్‌ కరణ్‌`టాక్‌ షోలో సమంత (Samantha), అక్షయ్‌ కుమార్‌ మధ్య జరిగిన స‌న్నివేశాలు ఆస‌క్తిగా మారాయి. 

టాలీవుడ్ హీరోయిన్ స‌మంత (Samantha) సౌత్‌తో పాటు నార్త్‌లోనూ పాపుల‌ర్ అయ్యారు. స‌మంత రీసెంట్‌గా `కాఫీ విత్‌ కరణ్‌`టాక్‌ షోలో పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన‌ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో స‌మంత క‌ర‌ణ్‌తో చెప్పే మాట‌లు, అక్ష‌య్‌తో క‌లిసి చేసిన డాన్సులు ఆస‌క్తిగా మారాయి. ఈ షో కోసం స‌మంత అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

`కాఫీ విత్‌ కరణ్‌`టాక్‌ షోలో సమంత  (Samantha), అక్షయ్‌ కుమార్‌ మధ్య జరిగిన స‌న్నివేశాలు ఆస‌క్తిగా మారాయి. 

స‌మంత ప్రోమో వైర‌ల్
బాలీవుడ్  స్టార్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఆధ్వర్యంలో  'కాఫీ విత్‌ కరణ్‌ సీజన్ 7' ప్రారంభ‌మైంది. ఆ షోలో స‌మంత కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి స‌మంత (Samantha)  కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7లో సంద‌డి చేశారు. ఈ షో ప్రోమో విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ షోలో సమంత, అక్షయ్‌ కుమార్‌ మధ్య జరిగిన స‌న్నివేశాలు ఆస‌క్తిగా మారాయి. 

`కాఫీ విత్‌ కరణ్‌`టాక్‌ షోలో సమంత  (Samantha), అక్షయ్‌ కుమార్‌ మధ్య జరిగిన స‌న్నివేశాలు ఆస‌క్తిగా మారాయి. 

క‌ర‌ణ్‌తో స‌మంత చెప్పిన‌ ముచ్చ‌ట్లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. అక్ష‌య్, సామ్‌ల‌తో క‌ర‌ణ్ జోహార్ ఆడించిన ఆట‌లు ఫ‌న్నీగా అనిపించాయి. అక్ష‌య్ కుమార్ స‌మంత‌ను ఎత్తుకుని షోలో ఎంట్రీ ఇవ్వ‌డం హైలెట్‌గా నిలిచింది. క‌ర‌ణ్‌ను వీరిద్ద‌రూ ఫ‌న్నీ డాన్సుల‌తో న‌వ్వించారు. స‌మంత‌ తనకు ర‌ణ్‌వీర్ సింగ్‌తో డాన్సు చేయ‌డం అంటే ఇష్ట‌మ‌ని చెప్పారు. 

స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా స‌మంత‌
కాఫీ విత్ క‌ర‌ణ్ షోకు సంబంధించి అంత‌కు ముందు రిలీజ్ అయిన ప్రోమోలో స‌మంత (Samantha) పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేశారు. అన్‌ హ్యాపీ మ్యారేజ్‌ లైఫ్‌కి క‌ర‌ణ్ జోహారే కార‌ణ‌మ‌న్నారు. ఆ ప్రోమో విప‌రీతంగా వైర‌ల్ అయింది. ఇక కరణ్‌ అడిగిన ప్రశ్నలకు సమంత ఏం స‌మాధానాలు చెప్పిందో తెలుసుకోవాల‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో స‌మంత ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.  అక్షయ్‌, సమంత ఎపిసోడ్ జూలై 21న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది. 

Read More: ఆస్ట్రేలియాలో జ‌రిగే సినిమా వేడుక‌ల్లో సంద‌డి చేయ‌నున్న స‌మంత‌ (Samantha)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!