ఆస్ట్రేలియాలో జరిగే సినిమా వేడుకల్లో సందడి చేయనున్న సమంత (Samantha)
టాలీవుడ్‌లో సమంత (Samantha) నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా సమంత కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో తన టాలెంట్ ఏంటో చూపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో జరిగే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్'కు ముఖ్య అతిథిగా సమంత హాజరుకానుంది.
సమంత (Samantha) సినిమాలపై ఫుల్ పోకస్ పెట్టారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అంతేకాకుండా సామ్ స్పెషల్ పాటల్లో నటించి మరింత పాపులర్ అవుతున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్'కు సమంత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ముఖ్య అతిథిగా సమంత (Samantha)
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్' జరగనున్నాయి. ఈ వేడుకలు ఆగస్టు 12 నుంచి మొదలు కానున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగే కార్యక్రమానికి టాలీవుడ్ నటి సమంత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ముఖ్య అతిథిగా హాజరవుతున్న సమంత తన నటనతో పాటు పరిశ్రమపై ఉన్న అనుబంధం గురించి ముచ్చటించనున్నారు. కరోనా కారణంగా 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్' రెండేళ్ల నుంచి జరగడం లేదు. ఈ సంవత్సరం సినీ వేడుకలను నిర్వహిస్తున్నారు.
.
గర్వంగా ఉంది- సమంత (Samantha)
భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించనుండడం గర్వంగా ఉందన్నారు సమంత. ఆస్ట్రేలియాలో జరిగే సినీ వేడుకలకు వెళ్లేందుకు ఆతృతతో ఉన్నానని తెలిపారు.
భారతీయ సినిమాలతో పాటు భారతీయ సినీ ప్రేమికులను ఒకే చోట కలవడం అంటేనే ఓ గొప్ప అనుభూతి అని సామ్ అన్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ రాజధాని నగరంలో సామ్ పలువురు సినీ ప్రముఖులను కలవనుంది.
Read More: Samantha Ruth Prabhu: పెళ్లి తర్వాత జీవితం వైలెంట్‌గా ఉంటుంది - నాగచైతన్యపై సమంత సెటైర్లు