కేజీఎఫ్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. షాక్ తింటారు !
వేయి కోట్ల రూపాయల బిజినెస్ ఎలా చేయాలో తెలిసిన సినీ మాంత్రికుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఈయన కేజీఎఫ్2 సినిమాతో ఇండియన్ రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ గురించే చర్చ జరుగుతోంది. ఆయన తీసుకొనే మొత్తం ఎంతో తెలిస్తే.. ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందే !
కేజీఎఫ్ 2 సినిమాతో యశ్ హీరోగా ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలుసు. కానీ పాన్ ఇండియా స్టార్‌గా యశ్‌కు ఒక హోదాను కట్టబెట్టింది మాత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అన్నది సత్యం. కేజీఎఫ్ 2 రికార్డుల మోత మోగించేలా ఈయన డైరెక్షన్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో కేజీఎఫ్ 2 అనే చిత్రం వేయి కోట్ల రూపాయలు రాబట్టిన నాలుగో సినిమాగా నిలిచింది. ఆ రికార్డు ఇంకెంత ముందుకు వెళుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో తెలుగు డైరెక్టర్ రాజమౌళి తీసుకొనే రెమ్యూనరేషనే అందరి కంటే ఎక్కువ. ఆయన తర్వాత ప్రశాంత్ నీల్ మాత్రమే ఇంతటి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఈయన తన మూడో సినిమాకే ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వచ్చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ఏ నిర్మాతైనా రూ.50 కోట్లు ఇవ్వాల్సిందే. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఉగ్రం, కేజీఎఫ్ చాప్టర్1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు ఆయనకు దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చాయి. ఆ సూపర్ హిట్ చిత్రాల వల్లే, ఆయన ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో స్టార్ డైరెక్టర్ రేంజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ రెండు తెలుగు ప్రాజెక్టులు సైతం చేస్తున్నారు.
హోంబేల్ ఫిలిమ్స్ నిర్మించిన కేజీఎఫ్ సినిమాలకు ప్రశాంత్ నీల్ ఎక్కువ డబ్బే తీసుకున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాకు నిర్మాతలు రూ.25 కోట్లు ప్రశాంత్ నీల్‌కు చెల్లించారు. అలాగే నిర్మాణ సంస్థ హోంబేల్ సంస్థ, తనకు లాభాలలో వాటా కూడా ఇస్తోందని టాక్. ఇక ప్రశాంత్ నీల్ సినిమాకు దక్కే బడ్జెట్ ఎంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ 31 సినిమాని ఈయన చేయనున్నారు. ఇక నిర్మాత డివివి దానయ్య కోసం మరో తెలుగు సినిమా చేయడానికి కూడా కమిట్ అయ్యారు. ఆ విధంగా ప్రశాంత్ నీల్ పాపులారిటీ రోజు రోజుకీ పెరిగిపోతోంది.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సొంత గ్రామం నీలకంఠాపురం. మాజీ మంత్రి రఘవీరారెడ్డికి ఈయన స్వయానా సోదరుడి కుమారుడు. ఈయన తండ్రి పేరు సుభాష్. ప్రస్తుతం బెంగళూరులో ప్రశాంత్ కుటుంబం స్థిర పడ్డింది