కేజీఎఫ్ 2 (KGF2) : అతి పెద్ద‌ రికార్డుకి చేరువలో.. మన రాకీ భాయ్

Updated on May 04, 2022 08:10 PM IST
హిందీ ఆడియ‌న్స్ స‌లాం రాఖీభాయ్ అంటున్నారు. య‌శ్ హీరోగా న‌టించిన కేజీఎఫ్‌(KGF2) ను భార‌త సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్ప‌టివ‌ర‌కు రూ.1000 కోట్లు వ‌సూళ్లు చేసిన నాల్గో సినిమాగా రికార్డు సాధించింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కేజీఎఫ్2 సినిమా రికార్డుల మోత మోగిస్తుంది
హిందీ ఆడియ‌న్స్ స‌లాం రాఖీభాయ్ అంటున్నారు. య‌శ్ హీరోగా న‌టించిన కేజీఎఫ్‌(KGF2) ను భార‌త సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్ప‌టివ‌ర‌కు రూ.1000 కోట్లు వ‌సూళ్లు చేసిన నాల్గో సినిమాగా రికార్డు సాధించింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కేజీఎఫ్2 సినిమా రికార్డుల మోత మోగిస్తుంది

హిందీ ఆడియ‌న్స్ స‌లాం రాఖీభాయ్ అంటున్నారు. య‌శ్ హీరోగా న‌టించిన కేజీఎఫ్‌ (KGF 2) భార‌తీయ సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్ప‌టివ‌ర‌కు రూ.1000 కోట్లు వ‌సూళ్లు చేసిన నాల్గవ సినిమాగా  సినీ చరిత్రపుటలకెక్కింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ కన్నడ చిత్రం, కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల మోత మోగించడం విశేషం. 

దంగ‌ల్, బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్. త‌ర్వాత రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరింది కేజీఎఫ్ 2 (KGF 2). య‌శ్ న‌ట‌న‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్వ‌క‌త్వం అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్ష‌కులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా గొప్ప టెక్నికాలిటీకి పెద్దపీట వేసిన ఈ సినిమా సాంకేతిక వర్గాన్ని కూడా ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. 

 

 రూ.1000 కోట్లు వ‌సూళ్లు చేసిన నాల్గవ భారతీయ సినిమా

పాన్ ఇండియ‌న్ స్టార్ య‌శ్ న‌టించిన కేజీఎఫ్ 2 ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ  చిత్రం ఇప్పుడు ఓ సంచలనం. క‌న్న‌డ భాష‌లో తీసిన కేజీఎఫ్ 2 ను ఐదు భాష‌ల్లో డబ్ చేసి విడుద‌ల చేశారు.  ఈ  పద్దతి ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను మరింత పెంచింది. 

కేజీఎఫ్ 2(KGF 2) రిలీజ్ అయిన మూడో వారంలోనే, ప్రపంచవ్యాప్తంగా  వేయి కోట్ల రూపాయ‌ల మార్క్ దాటింది. ఇంకొద్ది రోజుల్లో ఈ మార్కును దాటి రెండు వేల కోట్ల రూపాయ‌ల‌ను కొల్లగొట్టినా.. ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు. హిందీలో  కూడా రూ. 400 కోట్ల వ‌సూళ్లను దాటేందుకు రెడీగా ఉంది. హాలీవుడ్ రేంజ్ సినిమాగా దూసుకుపోతున్న కేజీఎఫ్ 2 హిందీలో ఎవ‌రూ సాధించ‌లేని రికార్డుల‌ను సృష్టించ‌నుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!