కేజీఎఫ్ 3 (KGF C 3): రాకీ భాయ్ ఫ్యాన్స్ కోసం.. బిగ్ బ్రేకింగ్ న్యూస్

Updated on May 14, 2022 05:06 PM IST
కేజీఎఫ్ అనే టైటిల్ భారతీయ సినీ ప్ర‌పంచాన్ని షేక్ చేసింది. కేజీఎఫ్, కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి.
కేజీఎఫ్ అనే టైటిల్ భారతీయ సినీ ప్ర‌పంచాన్ని షేక్ చేసింది. కేజీఎఫ్, కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో .. రాకీ భాయ్ యశ్

కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 3 (KGF Chapter 3) సినిమా అన్ని హంగులతో, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.  ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఎప్పుడు లొకేషన్లకు వెళ్లనుందో నిర్మాత ఓ క్లారిటీ ఇచ్చేశారు.  నిజం చెప్పాలంటే, ఈ తాజా అప్డేట్ రాకీ భాయ్ అభిమానులకు ఒక శుభవార్త లాంటిదే.

కేజీఎఫ్ అనే టైటిల్ భారతీయ సినీ ప్ర‌పంచాన్ని షేక్ చేసింది. కేజీఎఫ్, కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి.  వేల కోట్ల బిజినెస్‌తో సినిమా రేంజ్‌ను కూడా పెంచాయి. య‌శ్ నటనకు ప్ర‌పంచ‌మంతా ఫిదా అయిపోయింది. "స‌లాం రాఖీభాయ్"  అంటూ ఆయన ఫ్యాన్స్ క్లబ్స్ చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు. ఆయన సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం మిలియ‌న్స్‌కు చేరింది. దీంతో కేజీఎఫ్ 3 పై కొత్త కథనాలు వెలుగుచూశాయి. 

య‌శ్ కూడా తన అభిమానులు కోరుకుంటే, కేజీఎఫ్ 3 తప్పకుండా చేస్తానని తెలిపారు. ఇదే క్రమంలో, ఈ రోజు ఈ సినిమా పై వచ్చిన కొత్త అప్డేట్, ఆయన అభిమానులను దిల్ ఖుష్ చేసేసింది. 

ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా చేస్తున్న‌ "స‌లార్" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని  ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ ఓ ప్రకటనలో తెలిపారు. సలార్ సినిమా షూటింగ్ దాదాపు 30 శాతం పూర్త‌యింద‌ని.. మిగిలిన షూటింగ్ అక్టోబ‌ర్ 2022 లేదా న‌వంబ‌ర్‌లో పూర్తి అవుతుందని తెలిపారు. సలార్ విడుదల అయ్యాక..  ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో  కేజీఎఫ్ 3 షూటింగ్ ప్రారంభిస్తారని విజ‌య్ చెప్పారు. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై 2023 లో, కేజీఎఫ్ 3 సినిమాను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. 

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2లో య‌శ్‌కు జోడీగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన సంగతి తెలిసిందే. ఇక కేజీఎఫ్ 3 లో ఆమె పాత్రకు స్కోప్ ఉంటుందా ? లేదా? అనేది మరో ప్రశ్న. దీనికి సమాధానంగా,  కేజీఎఫ్ చాప్ట‌ర్ 3 లో ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రిపీట్ అయితే, అందులో తన పాత్ర ఉండవచ్చని శ్రీనిధి చెప్పింది. బాలీవుడ్ తారలు సంజ‌య్ ద‌త్, ర‌వీనా టండ‌న్‌లు కేజీఎఫ్ 2 లో ప్రధానమైన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక కేజీఎఫ్ 3 లో ప్రశాంత్ నీల్.. ఎలాంటి కొత్త తారలను తెరమీదికి తీసుకొస్తాడో తెలుసుకోవాలంటే, నవంబర్ వరకు వేచి చూడాల్సిందే. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!