ధరణిపై అమ్మ సంతకం కేజీఎఫ్ చాప్టర్2
"ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరు" ఒక్క డైలాగుతో అమ్మ గొప్పదనం గురించి తెలిపిన సినిమా కేజీఎఫ్ చాప్టర్2. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సూపర్ హిట్ సాధించింది. మదర్స్ డే సందర్భంగా హోంబలే ఫిలిమ్స్ కేజీఎఫ్ చాప్టర్ 2 నుంచి ఎదగరా..ఎదగరా.. పాటను రిలీజ్ చేసింది. కొడుకు కోసం అమ్మ పాడిన పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం అమ్మ కోసం తీసుకొస్తానంటూ చెప్పిన డైలాగులు అమ్మపై ప్రేమను చూపాయి. ఎన్ని కష్టాలొచ్చినా దాటుకుని ఎదగాలనే పాట అమ్మ బిడ్డ భవిష్యత్తు కోసం పడే తాపత్రయం ఒక్క పాటతో చూపించారు.
ఎదగరా ఎదగరా దినకరా
జగతికే జ్యోతిగా నిలవరా
పడమర నిశితెర వాలనీ
చరితగా ఘనతగా వెలగరా
అంతులేని గమ్యము కదరా
అంతవరకు లేదిక నిదురా
అష్టదిక్కులన్నియూ అదర
అమ్మకన్న కలగా పదరా
చరితగా ఘనతగా వెలగరా
చరితగా ఘనతగా వెలగరా
జననిగా దీవెనం
గెలుపుకె పుస్తకం నీ శఖం
ధగ ధగ కిరణమై
ధరణిపై చేయరా సంతకం
తందాని నానే తానితందానో
తానె నానేనో
హే నన్నాని నానే తానితందానో
తానె నానేనో
తందాని నానే తానితందానో
తానె నానేనో
హే నన్నాని నానే తానితందానో
తానె నానేనో
కేజీఎఫ్ చాప్టర్2 సినిమాలో యశ్‌కు అమ్మగా నటించారు అర్చన జైస్. కేజీఎఫ్ సినిమాల్లో అర్చన యాక్టింగ్ బ్యాక్ బోన్‌గా నిలిచింది. 26 ఏళ్ల వయసున్న అర్చన యశ్ లాంటి స్టార్ యాక్టర్‌కు అమ్మలా నటించారు. బడా స్టార్ పక్కన అర్చన నటన అద్భుతంగా చేశారంటూ ప్రశంసలు అందుకున్నారు. మహాదేవి సీరియల్ లో చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాలోని హీరో తల్లి పాత్రకు ఎంపిక చేశారు. ఆ విధంగా ఆమె కేజీఎఫ్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఎదగరా ఎదగరా