KGF Chapter 2: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 క‌లెక్ష‌న్ల‌కు దునియా మొత్తం ఫిదా.. రూ.1100 కోట్ల బిజినెస్

Updated on May 06, 2022 11:26 AM IST
 KGF Chapter 2:  ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో య‌శ్ హీరోగా వ‌చ్చిన కేజీఎఫ్ చాప్ట‌ర్2  సినిమా రూ.1100 కోట్ల బిజినెస్ చేసింది.
KGF Chapter 2: ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో య‌శ్ హీరోగా వ‌చ్చిన కేజీఎఫ్ చాప్ట‌ర్2 సినిమా రూ.1100 కోట్ల బిజినెస్ చేసింది.

KGF Chapter 2: కేజీఎఫ్ చాప్ట‌ర్2 సినిమా మొద‌టి రోజు నుంచే క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో య‌శ్ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా రూ.1100 కోట్ల బిజినెస్ చేసింది. వేయి కోట్ల రూపాయ‌లు  కొల్ల‌గొట్టిన భార‌తీయ సినిమాగా కేజీఎఫ్ చాప్ట‌ర్ సినిమా రికార్డు సాధించింది. 

య‌శ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా న‌టించిన కేజీఎఫ్ చాప్ట‌ర్2 (KGF Chapter 2) రికార్డులు మీద రికార్డులు సాధిస్తుంది. హోంబలే ఫిల్మిం కేజీఎఫ్ చాప్ట‌ర్2 సినిమాను నిర్మించింది. మే 1 నుంచి మే 5 వ‌ర‌కు అంటే ఐదు రోజుల్లో వంద కోట్టను వ‌సూళ్లు చేసింది. ఈ సినిమా ప‌ద‌కొండు వంద‌ల కోట్లు రూపాయ‌ల మార్కెట్ సృష్టించింది. 

కేజీఎఫ్ చాప్ట‌ర్2  సినిమా క‌లెక్ష‌న్‌ రూ.1100 కోట్లు

2022 సంవ‌త్స‌రంలో కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేసిన సినిమా కేజీఎఫ్ చాప్ట‌ర్2. రూ.1200 కోట్ల మార్క్‌ను త్వ‌ర‌లోనే దాటుతుంద‌ని సినీ ట్రేడింగ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నారు.  య‌శ్ సినిమా ఇండియాలో రూ.922 కోట్ల‌ను  కొల్ల‌గొట్టింది.  మిగ‌తా దేశాల్లో రూ. 185 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. 

బాహుబ‌లి త‌ర్వాత వేల కోట్ల రూపాయ‌లు వ‌సూళ్లు చేసిన ఇండియ‌న్ సినిమాగా రెండో స్థానంలో 
కేజీఎఫ్ చాప్ట‌ర్2  (KGF Chapter 2)నిలిచింది.  ఆర్.ఆర్.ఆర్, దంగ‌ల్ సినిమాల‌ను క్రాస్ చేసింది. ఇక బాహుబ‌లి రికాడ్డును బ్రేక్ చేయ‌డ‌మే నెక్ట్స్ అంటున్నారు సినిమా వ‌ర్టాలు. 

కేజీఎఫ్ చాప్ట‌ర్2  సినిమా క‌లెక్ష‌న్‌ రూ.1100 కోట్లు

ఇండియాలో వ‌సూళ్లు

క‌ర్నాట‌క - రూ.160 కోట్లు
ఏపీ / టీఎస్ - రూ.146 కోట్లు
త‌మిళ‌నాడు - రూ.101 కోట్లు
కేర‌ళ - రూ.60 కోట్లు
నార్త్ ఇండియా - రూ.455 కోట్లు

మొత్తం - రూ.922కోట్లు

కేజీఎఫ్ చాప్ట‌ర్2  సినిమా క‌లెక్ష‌న్‌ రూ.1100 కోట్లు

ఇత‌ర దేశాల్లో క‌లెక్ష‌న్

అమెరికా/కెన‌డా - $7.25 మిలియ‌న్స్
మిడిల్ ఈస్ట్ - $6.25 మిలియ‌న్స్
ఆస్ట్రేలియా - $2.50 మిలియ‌న్స్
న్యూజిలాండ్ - $0.42  మిలియ‌న్స్
మ‌లేషియా -  $2.55 మిలియ‌న్స్
సింగ‌పూర్ - $0.88 మిలియ‌న్స్
నేపాల్ - $0.90 మిలియ‌న్స్
రెస్ట్ ఆఫ్ ఆసియా -  $0.90 మిలియ‌న్స్
యూకే- $1.40 మిలియ‌న్స్
యూర‌ప్, ఆఫ్రికా - $1.50 మిలియ‌న్స్ 

ఓవ‌ర్సీస్ మొత్తం - $24.25 మిలియ‌న్స్(రూ.185 కోట్లు)

వ‌ర‌ల్డ్ వైడ్ - రూ.. 1107 కోట్లు

 

కేజీఎఫ్ చాప్ట‌ర్2  సినిమా క‌లెక్ష‌న్‌ రూ.1100 కోట్లు

కేజీఎఫ్ చాప్ట‌ర్2 (KGF Chapter 2) వ‌సూళ్ల సునామీతో థియేట‌ర్ల‌లో దూసుకుపోతుంది.  ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌కు ప్ర‌పంచం ఫిదా అయింది. య‌శ్ న‌ట‌న‌కు దునియా మొత్తం స‌లాం రాఖీబాయ్ అంటుంది. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!