Karthikeya 2 : 'కార్తికేయ 2' చిత్రం విడుదల తేదిలో మార్పు.. ఇతర చిత్రాలతో క్లాష్ కాకూడదని నిర్మాతల నిర్ణయం !

Updated on Aug 06, 2022 02:23 PM IST
ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో, కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం 'కార్తికేయ 2' (Karthikeya 2)
ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో, కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం 'కార్తికేయ 2' (Karthikeya 2)

కార్తికేయ 2 (Karthikeya 2) చిత్రం విడుదల తేదీ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యింది. నిజానికి ఈ సినిమా ఈ నెల 12వ తేదిన విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ రిలీజ్ డేట్‌ను 13వ తేదికి వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఎందుకంటే ఈ నెల 12వ తేదిన నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కావున డేట్స్ క్లాష్ కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. 

ఈ రోజు ఉదయం ఈ సినిమా యూనిట్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ "కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే సినిమా ఇది. కృష్ణుడు నిజంగా ఉన్నాడన్నది వాస్తవం. అందుకే 'కృష్ణా ఈజ్ ట్రూత్' అనే క్యాప్షన్‌తో ఈ సినిమా టైటిల్‌ని రిలీజ్ చేశాం. ప్రతీ మనిషిలో భక్తి భావాన్ని కలిగించే చిత్రమిది' అని అన్నారు. 

ఇది అందరి సినిమా : అనుపమ పరమేశ్వరన్

అలాగే ఈ సినిమాలో కథానాయికగా నటించిన అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ 'ఈ సినిమాను 5 ఏళ్ళ పిల్లాడి దగ్గర నుండి 60 ఏళ్ల పెద్దవాళ్ల వరకు అందరూ తప్పక చూడాల్సిందే. ఎన్నో సార్లు ఈ సినిమా వాయిదా పడింది. అయినా ఎట్టకేలకు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం' అని తెలిపారు. 

ఎంతో శ్రమకోర్చి షూటింగ్ పూర్తి చేశాం : నిఖిల్

ఇక ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha)  మాట్లాడుతూ 'ఎప్పటికప్పుడు ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూనే వస్తుంది. కరోనా పాండమిక్ సమయంలో, చాలా ఇబ్బందులు పడ్డాం. ఎంతో శ్రమకోర్చి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ఈ నెల 6వ తేదిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుంది" అని తెలిపారు. 

నిఖిల్ గతంలో 'కార్తికేయ' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'కార్తికేయ 2' (Karthikeya 2) చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. చందు మొండేటి గతంలో ప్రేమమ్, సవ్యసాచి, బ్లడీ మేరీ లాంటి సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. 

Read More: 'కార్తికేయ 2' రిలీజ్‌ను కొంద‌రు సినీ పెద్ద‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు : హీరో నిఖిల్

 


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!