లోకనాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ (Kamal Haasan) తర్వాత సినిమా ‘క‌బాలి’ ద‌ర్శకుడితో చేయనున్నారా?

Updated on Jul 18, 2022 12:40 AM IST
క‌మ‌ల్‌హాస‌న్ (Kamal Haasan), పా రంజిత్
క‌మ‌ల్‌హాస‌న్ (Kamal Haasan), పా రంజిత్

విక్రమ్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan). లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి కాసుల వర్షం కురిపించింది. చాలాకాలంగా తన రేంజ్‌ హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న కమల్‌కు ఈ సినిమా విజయం మంచి కిక్‌ ఇచ్చింది.

నాలుగేళ్ల తర్వాత తమ అభిమాన హీరో కమల్ హాసన్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్‌ అండ్ థ్రిల్లర్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన విక్రమ్‌ సినిమాను కమల్‌ ఫ్యాన్స్‌తోపాటు సినీ ప్రేమికులు కూడా ఎంజాయ్ చేశారు. తమిళంతోపాటు రిలీజైన అన్ని భాషల్లో కూడా విక్రమ్ సినిమా రికార్డులు సృష్టించింది. తమిళంలో బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటివరకు దాదాపుగా రూ.450 కోట్లు కలెక్ట్ చేసింది విక్రమ్ సినిమా.

ఈ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్ (Kamal Haasan).. టేక్‌ ఆఫ్, సీ యూ సూన్, మాలిక్‌ వంటి సూపర్‌‌హిట్‌ సినిమాలను తెరకెక్కించిన కేరళ డైరెక్టర్ మహేష్‌ నారాయణ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాతోపాటు కమల్‌ ‘ఇండియన్‌2’ సినిమాను పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే ఇండియన్‌2 సినిమా షూటింగ్‌ 30 శాతం వరకు పూర్తయ్యింది.

క‌మ‌ల్‌హాస‌న్ (Kamal Haasan), ఇండియన్‌2 సినిమా పోస్టర్

చరణ్‌తో సినిమా తర్వాత..

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇండియన్‌2’ సినిమాకు శంకర్‌‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్ ప్రస్తుతం రాంచరణ్‌తో సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం ఆర్‌‌సీ15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత శంకర్ ఇండియన్‌2 సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు.

శంకర్‌‌ ఈ సినిమాను పూర్తి చేసి ఇండియన్‌2 షూటింగ్‌ మొదలయ్యేలోపు మరో సినిమాను కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట కమల్‌. సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌తో కబాలి, కాలా వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పా రంజిత్‌. ‘సార్పట్ట పరంపర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రంజిత్. ప్రస్తుతం రంజిత్‌ విక్రమ్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు.ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్‌తో (Kamal Haasan) సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలిసింది.

Read More : భారతీయుడు–2 సినిమా తప్పకుండా రిలీజ్‌ చేస్తాం: కమల్ హాసన్ (Kamal Haasan)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!