ఆచార్య (Acharya) లో సీన్స్ లేకపోయినా.. కాజల్‌కు పేమెంట్ ఇచ్చారటగా!
టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్‌కు (Kajal Agarwal) కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చాలా ఏళ్లుగా తెలుగు చిత్రాలలో నటిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాలో చిరంజీవికి జోడిగా నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య (Acharya) సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. నిర్మాతలతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే కథాపరమైన కొన్ని ఇబ్బందులు ఎదురు కావడంతో, ఆమె పాత్రను దర్శకుడు తొలిగించారట. అలా పాత్రను తొలిగించినప్పటికీ, కాజల్‌కు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌ను నిర్మాతలు తిరిగిచ్చేశారనే టాక్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య (Acharya) అనుకున్నంత హిట్ అవలేదు. చిరంజీవికి జోడీగా కాజల్ కనిపిస్తుందని కొందరు అభిమానులు అనుకున్నారు. కానీ, వారికి కూడా ఆశాభంగమే అయ్యింది. ఆఖరికి దర్శకుడే ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చారు. సినిమాలో హీరో నక్సల్స్ భావజాలం కలిగిన వ్యక్తి కాబట్టి, అతనికో ప్రేమకథను జోడించడం సముచితం కాదనిపించిందని తెలిపారు. అందుకే కథలో చేసిన అనివార్యమైన మార్పుల వల్ల, కాజల్ పాత్రను తొలిగించినట్లు తెలిపారు.
కాజల్ అగర్వాల్‌కు తెలుగు సినిమాలలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. మిస్టర్ పర్ఫెక్ట్, మగధీర, టెంపర్.. ఇలా ఆమె ఖాతాలో అనేక హిట్లు ఉన్నాయి. కానీ కాజల్ కెరీర్‌లో ఆచార్య సినిమా ఓ బ్యాడ్ లక్‌గా మిగిలింది.మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించినా కూడా.. సినిమా నుంచి ఆ పాత్రను తొలిగించడం కాజల్ అగర్వాల్ అభిమానులకు నచ్చలేదట. చిరంజీవి పాత్రకు హీరోయిన్ అవసరం లేదని చిత్ర యూనిట్ అనుకున్నారు. అందుకే కాజల్‌కు హ్యాండ్ ఇచ్చారు.
ఓ అయిదు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనేందుకు.. కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమా సెట్స్‌కు వచ్చారు. అలాగే ఓ ప్రత్యేకమైన పాటలో కూడా ఆమె నటించారు. అయితే ఆ సీన్స్ అన్ని డిలీట్ చేసేశారు. దాదాపు 20 రోజుల పాటు కాజల్ షెడ్యూల్ ఉంటుందని తొలుత అనుకున్నారు. కానీ ఐదు రోజుల షూటింగ్ తర్వాత ఆమెను వద్దనుకున్నారు. అయినా నిర్మాతలు కోటిన్నర వరకు రెమ్యునరేషన్ కాజల్ అగర్వాల్‌కు చెల్లించారని టాక్.
కాజల్ అగర్వాల్ సాధారణంగా ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. పైగా, కాజల్ సినిమాలో ఉండుంటే. కాస్త చిత్రానికి గ్లామర్ అయినా తోడయ్యేది. ఆ విధంగా ఆచార్య (Acharya) కొంతలో కొంత అయినా హిట్ టాక్ తెచ్చుకునేదేమో అని మెగా అభిమానులు అనుకుంటున్నారు.