పుట్టింది నార్త్‌లోనే కానీ ర‌క్షిస్తుంది సౌత్ అంటున్న సోనూ సూద్ (Sonu Sood)

Updated on May 29, 2022 04:44 PM IST
హిందీలో చెత్త సినిమాలు చేయ‌కుండా ద‌క్షిణాది సినిమాలు న‌న్ను కాపాడాయి: సోనూ (Sonu Sood)
హిందీలో చెత్త సినిమాలు చేయ‌కుండా ద‌క్షిణాది సినిమాలు న‌న్ను కాపాడాయి: సోనూ (Sonu Sood)

సోనూ సూద్ (Sonu Sood) రీల్ లైఫ్‌లో విల‌న్ కానీ రియ‌ల్ లైఫ్‌లో హీరో. అవును సోనూ సూద్‌కు విల‌న్ పాత్ర‌లు మంచి గుర్తింపు తెచ్చాయి. అందులోనూ తెలుగు సినిమాల్లో సోనూ సూద్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. విల‌క్ష‌ణ విల‌న్‌గా పేరు తెచ్చుకున్నారు. వ‌రుస హిట్ సినిమాల‌తో సినీ కెరియ‌ర్ కొన‌సాగిస్తున్నారు. సోనూ సూద్ క‌రోనా స‌మ‌యంలో ఎంతో స‌హాయం అందించారు. దేశంలో సోనూ రియ‌ల్ లైఫ్ హీరో అయ్యారు. వ‌ల‌స కూలీల‌కు సోనూ అన్ని ర‌కాలుగా స‌హాయం అందించారు. సోనూ సూద్ రీసెంట్‌గా ఆచార్య తెలుగు సినిమాలో విల‌న్‌గా న‌టించారు. ఆ త‌ర్వాత హిందీలో పృథ్వీరాజ్‌ చిత్రంలో నటించారు. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ హీరోగా చేస్తున్న పృథ్వీరాజ్ సినిమాలో చాంద్‌ బర్దాయి పాత్రను సోనూ సూద్ చేస్తున్నారు.

సోనూ సూద్  (Sonu Sood)  సౌత్, నార్త్ సినిమాలంటూ ఓ కామెంట్ చేశారు. ఆ కామెంట్ల‌పై పెద్ద దుమార‌మే చెల‌రేగింది.

ద‌క్షిణాది సినిమాలు న‌న్ను కాపాడాయి: సోనూ (Sonu Sood)
సోనూ సూద్ సౌత్, నార్త్ సినిమాలంటూ ఓ కామెంట్ చేశారు. ఆ కామెంట్ల‌పై పెద్ద దుమార‌మే చెల‌రేగింది. బాలీవుడ్‌లో చెత్త సినిమాలు చేయ‌కుండా సౌత్ సినిమాలు త‌నను కాపాడాయ‌న్నారు. బాలీవుడ్‌లో మొద‌ట్లో పాజిటీవ్ రోల్స్ చేయాల‌నుకున్న సోనూ సూద్‌కు విల‌న్ క్యారెక్ట‌ర్ల ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ట‌. త‌నకు రిక‌మండ్ చేసే వాళ్లు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో నెగిటివ్ రోల్స్ పాత్ర‌ల అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని సోనూ అన్నారు. సినిమాల విష‌యంలో తాను చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున‌ని చెప్పారు. క‌థ‌ల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యాలు తీసుకుంటాన‌న్నారు. హిందీలో చెత్త సినిమాలు చేయ‌కుండా ద‌క్షిణాది చిత్రాలు త‌న‌ను కాపాడాయ‌ని చెప్పుకొచ్చారు. 

సినిమా బాగుంటేనే ప్రేక్ష‌కులు చేస్తారు.
ద‌క్షిణాది సినిమాలు ఎందుకు చేస్తున్నావ‌ని చాలా మంది త‌న‌ను ప్ర‌శ్నించే వార‌ని సోనూ చెప్పారు. త‌న‌కు ఎక్కువ సినిమాలు చేయ‌డం ద్వారా అనుభ‌వం వ‌స్తుంద‌ని చెప్పేవాడ‌న‌ని అన్నారు. ఏ సినిమా అయినా ఎంట‌ర్‌టైన్ చేసేలా ఉండాలి. అప్పుడే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని సోనూ అన్నారు. సౌత్‌లో చాలా మంచి సినిమాలు వ‌స్తున్నాయంటూ సోనూ చెప్పారు. ప్ర‌స్తుతం సోనూ సూద్  తమిళ, హిందీ సినిమాల్లో న‌టిస్తున్నారు. తమిళరసన్ , ఫతేలో సోనూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సోనూ (Sonu Sood)  న‌టించిన హిందీ సినిమా పృథ్వీరాజ్ సినిమా జూన్ 3న రిలీజ్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!