బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) నటనపై కామెంట్లతో ఎన్టీఆర్‌‌ (Junior NTR) తారక్ ట్వీట్లు

Updated on Aug 06, 2022 01:30 PM IST
కల్యాణ్‌రామ్ (Kalyan Ram)  బింబిసార సినిమాలో టైటిల్ రోల్‌లో అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ (Junior NTR) ట్వీట్
కల్యాణ్‌రామ్ (Kalyan Ram) బింబిసార సినిమాలో టైటిల్ రోల్‌లో అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ (Junior NTR) ట్వీట్

నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన సినిమా ‘బింబిసార’. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR)  చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా వరుసగా ట్వీట్లు చేశారు.

‘బింబిసార సినిమా అద్భుతాలు చేస్తోందని వింటున్నాను. సినిమాని మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులు ఉద్వేగంతో, ఉత్సాహంతో కొత్త అనుభూతిని పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు  ఎంతో ఆనందాన్ని ఇస్తాయి’ అని ఒక ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

‘కల్యాణ్ అన్నయ్యా! బింబిసార చక్రవర్తిగా నీ నటనకి సాటి మరొకరు లేరు. తలపండిన అనుభవజ్ఞుడిలా దర్శకుడు వశిష్ట ‘బింబిసార‘ సినిమాని తీర్చిదిద్దారు. లెజెండరీ సంగీత దర్శకులు కీరవాణి ఈ సినిమాకి వెన్నెముక అని చెప్పవచ్చు. ‘బింబిసార‘ సినిమా ఘనవిజయానికి కారకులైన నటీనటులు, టెక్నీషియన్లకి నా అభినందనలు" అని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. 

కల్యాణ్‌రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన బింబిసార సినిమాలో రాజుగా అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ (Junior NTR) ట్వీట్

పాజిటివ్ టాక్‌తో..

‘బింబిసార‘ సినిమాతో మల్లిడి వశిష్ట్ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. కేథరీన్ ట్రెసా, సంయుక్తా మీనన్, వరీన హుస్సేన్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన  ‘బింబిసార‘ సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చింది.

కళ్యాణ్ రామ్‌కు ఇటీవల సరైన హిట్ సినిమా పడలేదు. 2020వ సంవత్సరంలో నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా నిరాశే మిగిల్చింది. దాంతో దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి ‘బింబిసార‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ‘బింబిసార‘ సినిమా ప్రమోషన్లకు ఎన్టీఆర్‌‌ (Junior NTR) కూడా తనవంతు సహాయం చేశారు. ప్రచార కార్యక్రమాలకు తాను కూడా హాజరయ్యారు.

Read More : Bimbisara Review: టైమ్‌ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా సాగిన కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) ‘బింబిసార’ సినిమా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!